టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన న్యూస్ బాహుబలి. ఎందుకంటే తాజాగా ఈ మూవీపై సమంత కామెంట్ చేయటం దానికి వెంటనే రాజమౌళి కౌంటర్ ఇవ్వటం జరిగింది. ఈ వ్యవహారం పెద్దది కాకముందే సమంత స్వయంగా రాజమౌళికి ఫోన్ చేసి క్షమాపణలు అడిగింది. అంతే కాకుండా రాజమౌళి దగ్గర ఓ కమింట్ మెంట్ కూడ తీసుకుంది. మొన్నటి వరకూ బాహుబలి మూవీలో నటించను అన్న సమంత, ఇప్పుడు బాహుబలి మూవీలో నటిస్తాను అనేసరికి రాజమౌళి కూడ ఒకింత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడంట. ఎలగైనా సమంతకి ఓ ప్రాతను ఇవ్వటం కోసం రాజమౌళి కసరత్తులు చేస్తున్నాడు. సమంత కోసం డిజైన్ చేసిన పాత్రని తమన్న కి ఇవ్వడంతో ఇప్పుడు సమంత కోసం ఓ సరికొత్త క్యారెక్టర్ ని క్రియేట్ చేశాడు. ఈ ప్రాతకోసం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ యాక్టర్ ని సంప్రదించగా తను ఆ ప్రాత చేయలేనని చెప్పటంతో ఆ రోల్ కి యాక్టర్ కొరతగానే ఉంది. ఇప్పుడు ఆ ప్రాతకి సమంతని తీసుకుంటున్నట్టుగా టాలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పాత్ర కోసం సమంత ఫిట్ నెస్ ని మరింత పెంచుకోవల్సి ఉంది. మొత్తానికి సమంత అనుకున్నది సాధించుకుందని ఫిల్మ్ ఇండస్ట్రీ అంటుంది. బాహుబలి మూవీలో సమంత ఇప్పడు అవకాశం కావాలని అడగటం అనేది తమన్నకి కౌంటర్ ఇవ్వటానికే అని కొందరు అనుకుంటున్నా, తను మాత్రం టాలీవుడ్ చరిత్రలో నిలిచియే మూవీలో నటించాలన్నదే తన కోరిక అన్నట్టుగా చెబుతుంది. మొత్తానికి సమంత బాహుబలి మూవీలో ఎటువంటి రోల్ చేయబోతున్నదనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: