హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ‘బ్యాంగ్ బ్యాంగ్' విడుదల కాకుండానే రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈసినిమా ట్రైలర్ విడుదలైన 13 గంటల్లోనే యూట్యూబులో 1 మిలియన్ హిట్స్ మార్క్ దాటింది. ఒక రోజు పూర్తయ్యే సరికి ఏకంగా 25 లక్షల మంది ఈ ట్రైలర్ ను చూడటం ఇండియన్ సినిమా రికార్డు అని అంటున్నారు. లేటెస్ట్ గా ఈ ట్రైలర్ ను ఇప్పటి వరకు వీక్షించిన వారి సంఖ్య 5 మిలియన్ల మార్కును దాటింది అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కత్రినా కైఫ్ స్విమ్ సూట్‌లో పది నిమిషాలకు పైగా కనిపించడం ‘బ్యాంగ్ బ్యాంగ్’లో మరో విశేషం అని అంటున్నారు. ‘ధూమ్’ సిరీస్‌లో ఐశ్వర్యా రాయ్, బిపాసా బసు కూడా స్విమ్ సూట్‌లో కనిపించినా ఆ సన్నివేశాలను మరిపించేలా ఇందులోని కత్రినా స్విమ్ సూట్ సీన్ ఉంటుందని బాలీవుడ్ టాక్. పైగా ఆ సన్నివేశంలో హృతిక్‌తో కలిసి కత్రినా చాల ఘాటుగా నటించిందని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ఈసినిమా బాలీవుడ్ లో కొత్త రికార్డులను తిరగ రాస్తుందని విశ్లేషకులు అంటున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్స్ బాగున్నా యంటూ దర్శకుడు రాజమౌళి సైతం వ్యాఖ్యానించడంతో ఈ సినిమా బిజినెస్ టాలీవుడ్ లో కూడ దుమ్ము రేపుతుంది అని అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: