బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అందరి హాట్ టాపిక్ ఒకే ఒక్క మూవీ మీద ఉంది. అదే సల్మాన్ ఖాన్ నటించిన కిక్ మూవీ. జులై 25న రిలీజైన కిక్ మూవీ ప్రస్తుతం బిటౌన్ బాక్సాపీస్ ని షేక్ చేస్తుంది. రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ అయిన కిక్ మూవీ బాక్సాపీస్ వద్ద ప్రభంజనపు కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది. రిలీజ్ రోజు నుండి నాలుగు రోజుల వరకూ ప్రతి రోజు కిక్ మూవీ బాక్సాపీస్ వద్ద సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేస్తూనే వస్తుంది. కిక్ మూవీ అనేది టాలీవుడ్ లో రవితేజా నటించిన కిక్ మూవీకి రిమేక్ గా తెరకెక్కించారు. అయితే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించని కిక్ మూవీ, బాలీవుడ్ లోనూ అదే ఊపుని కొనసాగిస్తుంది. సల్మాన్ ఖాన్ ఈ మూవీలో నటించడం, అలాగే మూవీకి సంబంధించిన ప్రమోషన్ కూడ చాలా తెలివిగా చేయటంతో కిక్ మూవీపై హెవీ ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతూ వచ్చాయి. ఇప్పటి వరకూ కిక్ మూవీ నాలుగు రోజుల కలెక్షన్స్ దాదాపు 112 కోట్ల రూపాయలను కొల్లగొట్టిందని బిటౌన్ ట్రేడ్స్ లెక్కలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటి వరకూ సల్మాన్ ఖాన్ నటించిన వరుస మూవీలు వంద కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించటంతో, అత్యధిక మూవీలు వంద కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టిన హీరోగా సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో ముందు వరుసలో ఉన్నాడు. కిక్ మూవీ ఓవర్సీస్ లో ఇప్పటి వరకూ 22 కోట్ల రూపాయల బాక్సాపీస్ కలెక్షన్స్ ని సాధించింది. ఇండియాలో దాదాపు 90 కోట్ల రూపాయలకు పైగా బాక్సాపీస్ కలెక్షన్ష్ ని సాధించింది. కేవలం నాలుగు రోజుల్లోనే 112 కోట్ల రూపాయల బాక్సాపీస్ కలెక్షన్స్ ని సాధించటంతో మొదటి వారం పూర్తైయ్యే సరికి ఈ మూవీ 200 వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ ని సాధించడం ఖాయం అని ఇండియన్ బాక్సాపీస్ ట్రేడ్స్ లెక్కలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: