టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో నాని. ప్రస్తుతం నాని ఫిల్మ్ కెరీర్ ఆశించినంత సక్సెస్ లు లేకపోయిన్పటికీ, నాని మార్కెట్ మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది. మూవీ ఏ మాత్రం సక్సెస్ సాధించినా నిర్మాతకి లాభాలే. ఒక వేళ సక్సెస్ కాకపోయినా నిర్మాతకి మనీ వచ్చేస్తుందీ అనే ధీమా ప్రొడ్యూజర్స్ లో ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నాని చెతిలో పెద్దగా మూవీలు లేవు. తను నటించిన జెండా పై కపిరాజు మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా, పలు కారణాలతో రిలీజ్ వాయిదా పడుకుంటూ వస్తుంది. అలాగే గతంలో నాని నటించిన పైసా మూవీ కూడ పలు సార్లు వాయిదాలు పడుకుంటే వచ్చి నాని ఫిల్మ్ కెరీర్ ను ఇరకాటంలో పెట్టేసింది. దీంతో నాని తన మూవీల స్పీడుని తగ్గించాడు. వరుస మూవీలను చేసి స్టార్ డం ని పోగొట్టుకోకుండా, కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూవీలలో నటించే విధంగా ఫ్లాన్స్ వేసుకుంటున్నాడు. ప్రస్తుతం నాని కొత్త కథలను వినే పనిలో తెగ బిజిగా ఉన్నాడు. త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిటైల్స్ ని అనౌన్స్ చేయనున్నాడు. ఇదిలా ఉంటే నానికి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆపర్ వచ్చిందనే న్యూస్ టాలీవుడ్ లో వినిస్తుంది. గతంలో నాని యష్ రాజ్ ఫిల్మ్స్ లో నటించటంతో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ద్రుష్టిలో పడ్డాడు. అలాగే తన ఫ్రొఫైల్ ని బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలు ప్రొడక్షన్ సంస్థలకి పంపించాడంట. ప్రస్తుతం బాలీవుడ్ కి చెందిన బడా నిర్మాత సంస్థ హిందీ, తమిళ్, తెలుగు మూడు భాషల్లో ఒకే సారి ఓ మూవీని నిర్మించేందుకు సిద్ధం అవుతుంది. కథా పరంగా ఈ మూడు భాషల్లోనూ హీరోగా నానినే తీసుకునేందుకు నిర్ణయాలు జరుగుతున్నట్టుగా ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళితే నానికి స్టార్డ్ డం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: