నందమూరి సింహం బాలకృష్ణ పై పవన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం మొన్న జరిగిన తెలంగాణా సమగ్ర కుటుంబ సర్వేలో పవన్ పాల్గొనక పోవడాన్ని రకరకాల వ్యాఖ్యానాలతో విశ్లేషిస్తూ మీడియా చేసిన కామెంట్స్ పవన్ అభిమానులను బాధ కలిగించడమే కాకుండా ఈ విషయంలో బాలకృష్ణ పై ఎందుకు వార్తలు రాయడంలేదు అని మధన పడుతున్నట్లు టాక్.  ఇక వివరాలలోకి వెళితే మొన్న జరిగిన సర్వేలో పాల్గొన్న సెలెబ్రెటీల లిస్టులో బాలయ్య పేరు లేకపోవడంతో అసలు బాలయ్య తెలంగాణా కుటుంబ సర్వేలో పాల్గొన్నాడా ? లేదా అనే విషయం పై క్లారిటీ ఇవ్వకుండా పవన్ విషయాన్నే ప్రొజెక్ట్ చేస్తూ మీడియా వార్తలు రాయడమే కాకుండా ఈ విషయాన్ని ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి వరకు తీసుకు వెళ్ళడం పవన్ పట్ల మీడియా చేస్తున్న అన్యాయం కాదా? అని పవన్ వీరాభిమానులు బాధ పడుతున్నట్లు టాక్. అంతేకాకుండా ఏ సెలెబ్రెటీ వ్యక్తిగత విషయాలలోనూ అంతగా స్పందించని మీడియా పవన్ విషయంలో మాత్రం వేయి కళ్ళతో పరిశీలించడం ఆ వార్తను సంచలన వార్తగా చూపడం ఎంతవరకు న్యాయం అని పవన్ అభిమానులు మధన పడుతున్నారని టాక్.  కాని ఎంతమంది హీరోలు ఉన్నా టాలీవుడ్ ఎంపరర్ స్థానంలో పవన్ ఉండటంతో ఇంత రచ్చ జరుగుతోంది అన్న విషయం పవన్ అభిమానులకు తెలియదా ? అన్నదే సందేహం.    

మరింత సమాచారం తెలుసుకోండి: