ముద్దుగుమ్మ తాప్సీకి ప్రస్తుతం టాలీవుడ్ కోలీవుడ్ లలో అవకశాలు లేకపోవడంతో బాలీవుడ్ లో అప్పుడప్పుడూ వస్తున్న అవకాశాలతో రోజులు గడుపుతోంది తాప్సీ. ఎన్ని సినిమాలు చేసినా కాలం కలిసిరాక పోవడంతో ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా కోసం ఏకంగా తన గెటప్ ను మార్చేసుకుంది. లేటెస్ట్ గా బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ సరసన చేయబోతున్న ‘బేబీ’ మూవీలో ఈ అమ్మడు ఓ సీక్రెట్ ఏజెంట్ అవతారంలో కనిపించనుంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కూడ ఓ సీక్రెట్ ఏజెంట్ పాత్రనే పోషిస్తున్నా అతడి పైనే నిఘా పెట్టే పాత్రలో తాప్సీ హడావిడి చేస్తుందట.  ప్రస్తుతం ఘోరమైన పరాజయాల బాటలో పయనిస్తున్న తాప్సీ కెరియర్ కు ఈ సినిమా అయినా కలిసి వస్తుంది అనే ఆశతో ఈ చొట్ట బుగ్గల సుందరి ఈ ప్రయోగం చేస్తోంది అనే మాటలు వినపడుతున్నాయి. ఈ సినిమాలో రానా కూడ ఒక ప్రముఖ పాత్రలో నటిస్తూ ఉండటంతో ప్రస్తుతం కెరియర్ సరిగ్గా లేని రానా, తాప్సీలు ఈ వెరైటీ ప్రయోగం చేస్తున్నారు అంటూ సెటైర్లు వినపడుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: