నిన్న సాయంత్రం శిల్పకళా వేదికలో ‘గోవిందు అందరివాడేలే’ ఆడియో వేడుక అత్యంత కోలాహలంగా జరిగింది. ఒక్క పవన్ మినహా మెగా కుటుంబ హీరోలు వారివారి కుటుంబ సభ్యులతో వచ్చి మెగా అభిమానులకు కనువిందు చేసారు. అయితే ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ ఉండగా మెగా అభిమానులు చాలా మంది ‘పవన్ పవన్’ అంటూ పవర్ స్టార్ నామస్మరణ చేయడంతో కొద్దిగా అసౌకర్యాన్ని పొందిన చిరంజీవి ‘మీ మాసోదరుడు పవన్ ఈ సినిమా 150 రోజుల ఉత్సవానికి వస్తే అభ్యంతరమా’ అంటూ అభిమానుల వంక తీక్షణంగా చూస్తూ చిరంజీవి అన్న మాటలు ‘గోవిందుడు’ ఆడియో వేడుకలో హాట్ న్యూస్ గా మారింది. చిరంజీవి ఈ సమాధానం చెప్పిన తరువాత మాత్రమే మెగాస్టార్ మాటలను అభిమానులు వినడం మొదలు పెట్టారు. చిరంజీవి తనదైన రీతిలో ‘గోవిందుడు’ యూనిట్ సభ్యులను పేరు పేరునా ప్రశంసిస్తూ నిర్మాత బండ్ల గణేష్ ను బాక్సాఫీస్ గణేష్ అంటూ ప్రశంసించాడు.  అదేవిధంగా తన కెరియర్ కు ‘విజేత’ ఎటువంటి మలుపు తిప్పిందో చరణ్ కెరియర్ కు ‘గోవిందుడు’ ట్రెండ్ సెటర్ గా మారుతుంది అని అభిప్రాయ పడ్డాడు చిరంజీవి. ఇక్కడితో చిరంజీవి తన ఉపన్యాసాన్ని ముగించాలని ప్రయత్నించినా అభిమానులు తన 150 సినిమా గురించి కేకలు పెడుతూ గుచ్చిగుచ్చి అడుగుతూ ఉండటంతో మంచి కధ దొరికితే తన 150వ సినిమా ఈ సంవత్సరాంతంలో ఉంటుందని తన చేతిలో ఏమి లేదు అంటూ తేల్చి చెప్పేసాడు చిరంజీవి. దాదాపు మూడు గంటలు జరిగిన ఈ ఆడియో వేడుకలో ఎదో ఒక సందర్భంలో పవన్ నామస్మరణ మెగా అభిమానులు చేయడం ‘గోవిందుడు’ ఆడియో వేడుకకు టాప్ న్యూస్.   

మరింత సమాచారం తెలుసుకోండి: