టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ తో స్టార్ డంని సాధించిన హీరో నాని. స్వయంకృషితో హీరోగా ఎదిగిన టాలెంటెడ్ హీరో నాని ప్రస్తుతం తన చిత్రాల స్పీడుని చాలా వరకూ తగ్గించాడు. ‘ఈగ’ తర్వాత తను నటించిన చిత్రాలు ఏవీ అంతగా బాక్సాపీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. దీంతో తను ఎంచుకుంటున్న కథల్లో కొద్దిగా మార్పులు అవసరం అని గ్రహించాడు. ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’, ‘పైసా’, ‘ఆహా కళ్యాణం’ వంటి సినిమాలు బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడానికి ఉన్న కారణాలు ఏమిటో కనుక్కున్నాడు. దీంతో నాని ఇకనుండి తను ఎటువంటి మూవీలు ఎంపిక చేసుకోవాలో వంటి విషయాలపై పలు జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు. అందుకనే తను తన అప్ కమింగ్ మూవీల గురించిన కొన్ని విషయాలను ప్రత్యేకంగా తెలియజేశాడు. ‘నేను వినోదాత్మక సినిమాలలో నటించిన ప్రతిసారి ప్రేక్షకులు ఆదరించారు. ‘అష్టా చమ్మా’, ‘పిల్ల జమిందార్’, ‘అలా మొదలైంది’ సినిమాలు మంచి విజయం సాదించాయి. కామెడీ వదలి ఇతర జోనర్ లలో చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత 3 నెలల్లో 85 స్క్రిప్ట్స్ వరకు విన్నాను. అయితే నా వద్దకు వచ్చిన స్క్రిప్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎక్కువ కథలు ఎక్స్ పరిమెంటల్ స్టోరీలు ఉన్నాయి. వాటిల్లో నటించాలని ఉంది కాని, దాని వల్ల మూవీ బాక్సాపీస్ వద్ద వైఫల్యాన్ని చూడాల్సిఉంటుంది. చేసేదిలేక ఆ తరహా కథలకు నేను నో చెప్పాల్సి వచ్చింది. చాలా మంది దర్శకులు నాతో వర్క్ చేయాలని వస్తున్నారు. ప్రస్తుతం 3 సినిమాలను అంగీకరించాను, ఇకపై నటించే సినిమాలలో ప్రేక్షకులు నా నుండి ఆశించే అంశాలు అయిన, కామెడీ వంటివి ఉండేలా చూసుకుంటాను’ అంటూ ఈ విషయాలను పంచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: