మెగాస్టార్ చిరంజీవికి పవన్ కు మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయి అన్నది ఓపెన్ సీక్రెట్. అటు చిరంజీవి ఇటు పవన్ లు తమ కుటుంబ సంబంధాల విషయమై మీడియా ముందు ఎటువంటి కామెంట్స్ చేయకపోయినా వారి ప్రవర్తన మాత్రం ఈ అన్నదమ్ములు ప్రస్తుతం ఐక్యతగా లేరు అనే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తాయి. మొన్న జరిగిన ‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో వేడుకలో చిరంజీవి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి పవన్ కళ్యాణ్ ‘గోవిందుడు’ 150 రోజుల ఫంక్షన్ కు వస్తాడు అంటూ ఒక మాట వదిలి పవన్ చిరంజీవిల మధ్య మరింత గ్యాప్ మెగా అభిమానులలో పెరగ కుండా ప్రస్తుతానికి గట్టేక్కాడు.  అయితే చిరంజీవి అన్నమాటలే ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా మూల కధ అంటూ కొంత మంది సరికోత్త విశ్లేషణలు చేస్తున్నారు. సమిష్టి కుటుంబ అవసరాన్ని తెలియచేస్తూ ఆప్యాయతలు అనురాగాలు చిన్నచిన్న భేదాభిప్రాయాలు వల్ల దూరం కాకూడదనే విషయాన్ని వివరిస్తూ విడిపోయిన కుటుంబాన్ని లండన్ నుంచి వచ్చిన హీరో కలిపిన కధ గోవిందుడు.  అదేవిధంగా నిజజీవితంలో కూడ రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు’ అనుకున్న విధంగా సూపర్ హిట్ అయి 150 రోజుల ఫంక్షన్ జరిగినప్పుడు చరణ్ అడిగితే ఆ ఫంక్షన్ కు రావడానికి పవన్ కాదనడేమో అనే సెటైర్లు చిరంజీవి ‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో వేడుకలో మాట్లాడిన మాటల పై వినపడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: