1980-1990 ల మధ్య ఒక దశాబ్ద కాలం శృంగార దేవతగా దక్షిణాది భాషలలోని అన్ని సినిమాలలోను కనిపిస్తూ ఐటమ్ బాంబుగా అలనాటి యువతరాన్ని షేక్ చేసిన షకీలా ఈ మధ్య కాలంలో తరుచు మీడియా వార్తలలోకి వస్తోంది. ఈ మధ్యనే తన ఆత్మ కధ రచనతో సంచలనాలకు తెరతీసిన షకీలా కొద్దిరోజుల క్రితం చెన్నైలో తనను కలిసిన మీడియా వారితో మాట్లాడుతూ హీరోయిన్ల జీవితాల పై సంచలన వ్యాఖ్యలు చేసింది.  సినిమాలలో నటించే ఏ హీరోయిన్ కూడా రియల్‌ లైఫ్‌లో నిజాలు చెప్పడానికి ముందుకు రారని ఆమె కామెంట్స్ చేసింది. అంతేకాదు ప్రస్తుతం హీరోయిన్స్ దృష్టి అంతా డబ్బు సంపాదన పైనే ఉంది కాబట్టి అసలు నిజాలను ఏ హీరోయిన్ బయటకు చెప్పడానికి సాహసించదు అంటూ కామెంట్లు చేసింది షకీలా. అంతేకాదు ఎవరైనా చెప్పకపోతే నిజాలు ఎలా బయటపడతాయని ఆమె మీడియాకే ఎదురు ప్రశ్న వేసింది. ఇలాంటి విషయాలన్నీ తన ఆత్మకథ‌లో రాశానని అంటున్న షకీలా తన ఆత్మకధ తెలుగు అనువాదం డిసెంబర్ లో విడుదల అవుతుంది అని అంటోంది. అయితే తన ఆత్మకధలో కూడ పేరున్న గొప్ప వాళ్ళ పేర్లను బయట పెట్ట లేకపోయాననీ అలా బయట పెడితే తనకు ప్రాణహాని ఉంది అని అంటోంది ఒకనాటి ఈ సెక్సీ బ్యూటీ. అయితే ట్విస్ట్ ఏమిటంటే తనలాగే ప్రస్తుత హీరోయిన్స్ కూడ భయపడుతున్నారు అన్న విషయం ఈమెకు తెలియదా? అన్నదే సమాధానం లేని ప్రశ్న.   

మరింత సమాచారం తెలుసుకోండి: