కోట్లాది రూపాయలను తాము నటిస్తున్న సినిమాలకు పారితోషికాలుగా తీసుకుంటున్ననటీ నటుల గురించివిన్నాం. కాని ఒక జత బూట్ల కోసం అక్షరాలా12 కోట్లు ఖర్చు పెట్టిన హాలీవుడ్ స్టార్ వ్యవహారం ఇప్పడు సంచలనంగా మారింది. హాలీవుడ్ స్టార్ నిక్ క్యానన్ ఇటీవల జరిగిన ఒక హాలీవుడ్ సినిమా కార్యక్రమానికి వేసుకొచ్చిన షూలు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. ఈ హాలీవుడ్ స్టార్ వేసుకున్న షూల ఖరీదు అక్షరాలా 2 మిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే మనదేశపు కరెన్సీలో 12 కోట్లు. ఇంత ఖరీదు ఈ బూట్లకు పెరగడానికి గలకారణం ఈ బూట్లలో వజ్రాలు ఉపయోగించడమే కారణం అని అంటున్నారు. లెదర్ షూలపై ముందు వైట్ గోల్డ్‌తో కోటింగ్ ఇచ్చి ఆ వైట్ గోల్డ్ లో ఫుల్ కట్ రౌండ్ వైట్ వజ్రాలు పొదిగారట. 340 కేరట్ల వజ్రాలుతో మిలమిల లాడుతున్న ఈబూట్లు ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన షూలు అని అంటున్నారు. త్వరలోనే ఒక సామజిక సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాల కోసం ఈ బూట్లను వేలం వేస్తారట. ఈ బూట్లను తయారు చేసింది ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ జాసన్ ఆరాషెబెన్. ప్రస్తుతం అమెరికా మీడియాకు ఈ బూట్ల టాపిక్ హాట్ టాపిక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: