మహేష్ ‘ఆగడు’ పరాజయంతో తన ‘గోవిందుడు అందరివాడేలే’ కి ఎదురులేదు అని భావిస్తూ మంచి జోష్ మీద ఉన్న రామ్ చరణ్ కు దసరా పండుగను టార్గెట్ చేస్తూ సరిగ్గా తన సినిమా విడుదలకు ఐదు రోజుల ముందు విడుదలవుతున్న ‘పవనిజం’ సినిమా ఏ ధైర్యంతో తన ‘గోవిందుడు’ తో పోటీ పడుతోంది అనే అంశం చరణ్ కు షాకింగ్ గా మారింది అని వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం పవన్ నటించిన ఏ సినిమా విడుదల కాకపోవడంతో పవన్ అభిమానులు నామస్మరణ చేసే ‘పవనిజం’ కధా వస్తువుగా ఈ సినిమా రాబోతు ఉండటంతో పవన్ నామస్మరణ దసరా పండుగ నేపధ్యంలో సందడి చేస్తున్న ఇన్ని భారీ సినిమాల మధ్య మెగా అభిమానులను ధియేటర్ల వరకు రప్పించగలిగితే అతి తక్కువ పెట్టుబడితో తీసిన ఈ సినిమా లాభాల పంట పండటం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు. ఈ మధ్య కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటే చాలు హిట్టవుతున్నాయి. నితిన్ లాంటి హీరోలు కూడ పవన్ కళ్యాణ్ సినిమాలోని పాటను తన సినిమాలకు టైటిల్ గా పెట్టేసుకొని హిట్టు కొట్టేసిన సందర్భాలు చూసాము. పవన్ కళ్యాణ్ అభిమానుల అభిమతం అయిన‘పవనిజం' కాన్సెప్టే సినిమా కథగా మారితే ఎలా ఉంటుంది, అలాంటి ఆలోచనలోంచి వచ్చిందే ‘పవనిజం' సినిమా. ఈ సినిమా ఈనెల 26న గోపీచంద్ ‘లౌక్యం’ తో పోటీగా విడుదల కాబోతోంది. పవన్‌ అభిమానులు తలుచుకుంటే సమాజాన్ని ఏ విధంగా మార్చగలరో తెలియజెప్పే సినిమా ఇది అని అంటున్నారు. మరి ఈ సినిమా పై పవన్ వీరాభిమానులు ఎటువంటి స్పందన చూపెడతారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: