దసరాకు విడుదల కాబోతున్న రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడెలే’ సినిమాకు 1979 ప్రాంతంలో విడుదలైన కళాతపస్వి విశ్వనాద్ దర్సకత్వం వహించిన ‘శంకరాభరణం’ పోటీగా మారడం రామ్ చరణ్ ను ఆశ్చర్య పరుస్తోంది అనే వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ పోటీకి వేదిక మన రాష్ట్రం కాదు మన పక్కన ఉన్న తమిళనాడు. ‘మగధీర’ సినిమాతో చరణ్ కు తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడటంతో చరణ్ సినిమాలను వీలైనన్ని ఎక్కువ ధియేటర్లలో చెన్నైలో కూడ విడుదల చేయడం ఒక పద్దతిగా మారింది. ఆ పద్దతిని కొనసాగిస్తూ రేపు దసరాకు అక్టోబర్ 1న ‘గోవిందుడు’ సినిమాను చెన్నైలోని చాల ధియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే అదే దసరా పండుగను టార్గెట్ చేస్తూ ప్రముఖ గాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఒకనాటి ‘శంకరాభరణం’ సినిమాను డిజిటలైజ్ చేయడమే కాకుండా కలర్ కరక్షన్ కూడా చేసి భారీ పబ్లిసిటీతో తమిళనాడు అంతా విడుదల చేయబోతున్నాడు. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే చెన్నై ప్రాంతంలో ఒకేసారి విడుదల అవుతున్న చరణ్ ‘గోవిందుడు’ ను ఆదరిస్తారా లేకుంటే ఒకనాటి సూపర్ హిట్ శంకరాభరణం ను చూస్తారా అనే విషయం కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: