చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో తనకు ఎదురైన మీడియవారి పై ఒక్కసారిగా చిరుత లా మీద పడింది సమంత. అనుకోని సమంత ఉగ్ర రూపానికి మీడియా కూడ షాక్ అయింది. అయితే సమంత ఇంత ఉగ్రరూపంలో కనిపించడానికి ఒక కారణం ఉంది. సమంత నాలుగురోజులు షూటింగ్ లలో కనిపించకపోతే ఆమె ఏదో ఒక వ్యాధితో సమంత బాధ పడుతోందని మీడియాలో వార్తలు రావడం ఆలవాటైపోయింది. గతంలో కూడ సమంత చర్మవ్యాధి పై మీడియాలో పలు కథనాలొచ్చాయి. అది మరువకముందే సమంత ముక్కుకు గాయమైందనీ, దాంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని మరికొన్ని కథనాలు మీడియాలో హల్ చల్ చేసాయి. ఈ వార్తలు చాలవు అన్నట్లుగా మీడియా మరొక అడుగు ముందుకు వేసి సమంత ముక్కుకు గతంలో జరిగిన గాయం వల్ల ఆమె ముక్కుకు ఓ సారి సర్జరీ జరిగిందనీ, అందుకే ముక్కు ఆకారంలో మార్పు వచ్చిందనీ, మళ్లీ అంతకు ముందు ఉండే అందమైన ముక్కుగా సమంత ముక్కును తీసుకురావడానికి మరో సర్జరీ అవసరం అనీ, అందుకే ప్లాస్టిక్ సర్జరీ నిమిత్తం సమంత లండన్ వెళ్ళబోతోందని ఈమధ్య సమంత పై వరస పెట్టి కధనాలు వచ్చాయి. ఈ వార్తలు సమంత దృష్టి దాకా వెళ్ళాయి కాబోలు చెన్నైలో సమంతకు మీడియా ప్రతినిధులు కనిపించగానే ఇంకా వారు ఏమి ప్రశ్నలు వేయకుండానే సమంత కోపంతో ఊగిపొతూ ‘‘నా ముక్కు బ్రహ్మాండంగా ఉంది. పైగా నాది అందమైన ముక్కు. దానిపై కత్తి పెట్టించుకోవాల్సిన అవసరం ఏంటి నాకు? ఇలాంటి వార్తల్ని ఇప్పటికైనా ఆపితే మంచిది. నాకసలే ముక్కుమీదే ఉంటుంది కోపం’’ అంటూ మీడియా పై చిరుబుర్రులాడిన సమంత కామెంట్లు ఇప్పుడు కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: