ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు న్యాయస్థానం విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను నిరసిస్తూ తమిళ చలన చిత్ర పరిశ్రమ అంతా ఆమెకు సంఘీభావం తెలుపుతూ నిన్న చేపట్టిన నిరాహారదీక్షలో పాల్గొనడానికి ఒక్క రజినీకాంత్ మినహా తమిళ సినిమా పరిశ్రమలోని ప్రముఖులందరూ ఒక త్రాటి పైకి రావడం సంచలన వార్తగా మారింది. అవినీతి కేసులలో జయలలిత కూరుకు పోయినా అది ఏమి పట్టనట్లుగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమ జయలలిత పట్ల తన భక్తి ప్రపత్తులు చాటుకుంది ఈ సందర్భంగా తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో ప్రదర్శనలు కూడా రద్దు చేశారు. అంతేకాకుండా నిన్న జరగవలసిన షూటింగులను కూడా రద్దు చేసారు. చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులు అంతా చేపాక్కం అతిథి గృహం వద్ద నిన్న మౌన దీక్ష చేపట్టారు. అంతేకాకుండా చలన చిత్ర పరిశ్రమ అతిరథ మహారథులు కూర్చోడానికి అనువుగా అక్కడ వేదిక ఏర్పాటు పెద్ద వేదిక పై పెద్దపెద్ద అక్షరాలతో వ్రాయ పడ్డ బ్యానర్ 'ధర్మ దేవదైక్కు అనీదియా?' ధర్మ దేవతకు అన్యాయమా? అని వ్రాయ పడ్డ అక్షరాలు కోలీవుడ్ పరిశ్రమకు జయలలిత పట్ల ఉన్న అభిమానాన్ని చాటాయి.  రజినీకాంత్ తో పాటు ఈ మొన నిరాహార దీక్ష శిబిరానికి కమలహాసన్ కూడా రాకపోవడంతో ఆప్త మిత్రులైన కమల్, రజనీలు ఒకే మార్గాన్ని జయలలిత విషయంలో ఎంచుకున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: