కన్నడ బ్యూటీ రమ్య కనిపించడంలేదు అంటూ గత కొద్ది రోజులుగా కన్నడ, తమిళ మీడియాలో వస్తున్న వార్తలు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. హీరోయిన్ రమ్య రెండు నెలలుగా ఆమె ఎక్కడుందో, ఏం చేస్తుందో అంతు చిక్కడంలేదు అంటూ కన్నడ మీడియాలో రకరకాల కథనాలొస్తున్నాయి.  గతంలో మాండ్య లోక్‌సభకు ఎంపీగా ఎన్నికైన ఈమె మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనికి తోడు తన ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాల్లో చురుకుగా ఉండే రమ్య అక్కడ కూడా తన కామెంట్లు గత కొన్ని నెలలుగా రాయకుండా మౌనం వహించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  దీనితో హీరోయిన్ రమ్య పై రకరకాల గాసిప్పులు హడవిడి చేస్తున్నాయి. కొన్ని పత్రికలు ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో ఏమిచేయాలో అర్ధం కాక లండన్‌ కు వెళ్లిపోయిందని కొంతమంది గాసిప్పులు రాస్తూ ఉంటే మరి కొందరు రమ్య తీవ్ర నిరాశతో మీడియాకు, సినిమా రంగానికి కావాలనే దూరంగా ఉంటోంది అనే ప్రచారం జరుగుతోంది. అయితే కన్నడ మీడియా ఇప్పుడు ఇంత హఠాత్తుగా రమ్యను టార్గెట్ చేస్తూ వార్తలు ఎందుకు రాస్తోంది అనే విషయం చాలామందికి అర్ధంకాని ప్రశ్నగా మారింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: