నిన్నటి నుండి ప్రింట్ మీడియా, వెబ్ మీడియా, ఛానల్స్ లలో పవన్ ‘గబ్బర్ సింగ్ 2’ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక అయింది అని వార్తల హడావిడి జరగడంతో ఈ ఢిల్లీ బ్యూటీతో పవన్ రొమాన్స్ చేయడం ఖాయం అని అనుకున్నారు అంతా.  అయితే తన పై వస్తున్న వార్తలు చూసి రకుల్ తనకు ఎదురైన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ షాకింగ్ రిప్లయ్ ఇచ్చింది అనే వార్తలు వస్తున్నాయి. తాను ‘గబ్బర్ సింగ్ 2’ లో హీరోయిన్ గా ఎంపిక అయిన విషయం తాను కూడా మీడియా వార్తలలో చూస్తున్నానని అయితే ఈ వార్తలు ఎవరు ఎందుకు పుట్టించారో తెలియకపోయినా ఆ వార్త నిజం కావాలని కోరుకుంటున్నానని రకుల్ సమాధానం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.  అయితే ఇదే సందర్భంలో రకుల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో నటించాలని ప్రతి హీరోయిన్‌ కోరుకుంటుందని అదేవిధంగా తనకు కూడా ఆ ఆశ ఉన్నా అవకాశం రావాలి కదా అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది రకుల్. ఈ బ్యూటీ ఇచ్చిన సమాధానం బట్టి పవన్ గబ్బర్ సింగ్ సీక్వెల్ హీరోయిన్ ఎంపిక మళ్ళీ యూటర్న్ తీసుకుని తిరిగి అదే సస్పెన్స్ కొనసాగుతోంది అనుకోవాలి.  అసలు రకుల్ చెప్పిన మాటలను బట్టీ పవన్ నిజంగానే ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ ను పట్టాలు ఎక్కిస్తాడా అనే అనుమానం కలగడం ఎవరికైనా సహజం...  

మరింత సమాచారం తెలుసుకోండి: