టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ కు కోలీవుడ్ హీరో విజయ్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్యా చాలా మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. తమిళంలో విజయ్ నటించిన ‘ఖుషి’ సినిమాను తెలుగులో పవన్ రీమేక్ చేస్తే పవన్ ‘తమ్ముడు’ సినిమాను విజయ్ తమిళంలో రీమేక్ చేసి ఇద్దరూ ఘన విజయం సాధించారు.  ఈ నేపధ్యంలో మొన్న దీపావళి సందర్భంగా కోలీవుడ్ లో విడుదల అయిన ‘కత్తి’ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామనే ఉద్దేసంతో పవన్ తన సన్నిహితుల ద్వారా ఈ సినిమా రీమేక్ రైట్స్ పై మక్కువ చూపెడుతూ ఈ నెల 31న విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ విడుదల కాకుండా ఈ సినిమా రైట్స్ కొనడానికి ప్రయత్నించిన పవన్ సన్నిహితుల ప్రయత్నానికి హీరో విజయ్ నుంచి సానుకూల స్పందన రేలేదని తెలుస్తోంది.  టాలీవుడ్ సినిమారంగం పై కుడా ఎప్పటినుంచో కన్నువేసిన విజయ్ పవన్ ‘కత్తి’ రీమేక్ కోరికను తాను మన్నించ లేను అంటూ మర్యాద పూరకంగా సమాధానం ఇచ్చి తప్పించుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తలు ఇలా ఉండగా తమిళ సంఘాల వివాదాల మధ్య విడుదల అయిన ‘కత్తి’ సూపర్ హిట్ టాక్ స్వంతం చేసుకుంది. సమాజిక కధాంశం తో తీసిన ఈ సినిమాలో ఈ సినిమా లో వినోదం పాళ్ళు తక్కువగా ఉంది అన్న చిన్నపాటి విమర్శలు తప్ప ఈ సినిమాకు ముఖ్యంగా విజయ్ నటనకు విమర్శకుల ప్రశంసల తో పాటు భారీ కలెక్షన్స్ కుడా వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: