టాలీవుడ్ సినిమాలకు ప్రస్తుతం చాలా దూరంగా ఉంటున్న షీలాతన డేటింగ్ విషయం పై వివరణ ఇచ్చినట్లుగా నిన్న ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికలో ప్రచురితమమైన వార్త అందరినీ ఆశ్చర్య పరుస్తోoది. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో తనకు ఎలాంటి రిలేషన్ లేదని అంటూ హీరోయిన్ షీలా చెప్పిన విషయాన్ని నిన్న ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ప్రచురిo చింది. ఆసలు ఈ వార్తలు తనపై ఎందుకు పుట్టి స్తున్నారో అనకు అర్ధం కావడం లేదని షీలా ఆ ఆంగ్ల పత్రిక ప్రతినిధితో మాట్లాడినట్లుగా ఆ పత్రిక వ్రాసింది. అయితే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం గాసిప్పులుగా వచ్చిన ఈ డేటింగ్ వార్తల పై షీలా ఇప్పుడు ఇంత హడావిడిగా మీడియాకు ఎందుకు క్లారిటీ ఇచ్చింది అన్న విషయం పై క్లారిటీ లేదు. కొన్ని సంవత్సరాల క్రితం దిల్ రాజు ‘పరుగు’ సినిమా నిర్మిస్తున్న రోజులలో ఈమె పై ఈ గాసిప్స్ వచ్చాయి. ఆతరువాత ఆ గాసిప్స్ ను అందరు మర్చిపోయారు.  ఆ ఆంగ్ల పత్రికకు షీలా ఇచ్చిన వివరణ ప్రకారం తాను దిల్ రాజుని చివరగా ‘అదుర్స్’ ఆడియో ఫంక్షన్ లోనే చూసానని అంటూ ఆ తరువాత ఆయనను కలవలేదు అని చెపుతోంది. అంతే కాదు అసలు తన దగ్గర దిల్ రాజు ఫోన్ నెంబర్ కూడా లేదని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.  తాను గత కొన్ని సంవత్సరాలుగా యు.కె లో ఉంటున్నాను అంటూ తనకు తెలుగు పరిశ్రమలోఎవరు ప్రత్యేకంగా స్నేహితులు లేరు అని చెపుతున్న షీలా ఇలా మీడియా ముందుకు రావడం సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఇదే విషయమై ఆ ఆంగ్ల పత్రిక ప్రతినిధి దిల్ రాజ్ ను ప్రశ్నించగా ఎటువంటి నిలకడలేని,వాస్తవం కాని ఇటువంటి రూమర్స్ పై తాను ఏమి కామెంట్స్ చేస్తాను అని అన్నట్లుగా ఆ పత్రిక రాసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: