సినిమాలలో హీరోగా నటిస్తూ కోట్ల రూపాయలను గణిస్తున్న అల్లుఅర్జున్ వెడ్డింగ్ ప్లానర్ గా మారిపోయాడు. అయితే ఈ విషయం జీవితానికి సంబంధించినది కాదు. అల్లుఅర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త సినిమాలో అల్లుఅర్జున్ వెడ్డింగ్ ప్లానర్ గా కనిపిస్తూ తెగ సందడి చేయడమే కాకుండా రకరకాల పెళ్ళిళ్ళలో తనకు నచ్చిన ముగ్గురు హీరోయిన్స్ తో రోమాన్స్ చేసే ఈ సినిమాలో బన్నీ పాత్ర విపరీతమైన కామెడీ టచ్ తో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.  ‘అత్తారింటికి దారేది’ సూపర్ హిట్ తరువాత త్రివిక్రమ్ ‘రేసు గుర్రం’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బన్నీ ఇలా ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడటమే కాకుండా అప్పుడే బిజినెస్ పరంగా కూడా మంచి మార్కెట్ పలుకుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ అప్పుడే 6కోట్ల ధర పలికింది అంటే ఈ సినిమా క్రేజ్ బయ్యర్లలో ఎలా ఉందో అర్ధం అవుతుంది.  ఈ సినిమాకు సంబంధించి అన్ని నిర్మాణ పనులు పూర్తి చేసి రాబోతున్న సమ్మర్ సీజన్ కు ప్రారంభ సినిమాగా మార్చిలో విడుదల చేసే ఉద్దేశ్యంలో ఈ సినిమా నిర్మాతలు ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. బన్నీ తన కెరియర్ లో ముగ్గురు హీరోయిన్స్ తో నటిస్తూ ఉండటం ఈ సినిమాకు మరో ప్లస్ గా మారుతోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: