ఈరోజు తెలుగు సినిమా రంగాన్ని శాసిస్తున్న ఆ నలుగురు వ్యక్తులలో అల్లుఅరవింద్ ఒకడు అన్న విషయం ఓపెన్ సీక్రెట్. అయితే తెలుగు సినిమా పంపిణీ రంగాన్ని శాసిస్తున్న అరవింద్ తాను పెద్ద రౌడీని అంటూ తనను మించిన రౌడీ మరెవ్వరు లేరు అని బహిరంగ ఫంక్షన్ లో తానే ప్రకటించు కోవడం సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే నిన్న రాత్రి జరిగిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ ఆడియో ఫంక్షన్ లో అరవింద్ ఈ మాటలు అని అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఈ ఆడియో వేడుకకు సంబంధించి ఏర్పాటు చేసిన పలు వినోద కార్యక్రమాలలో నటుడు రఘ బాబు, ప్రభాస్ శీను నటించిన ఒక కామెడీ స్కిట్ అందర్నీ ఆకర్షించింది.  ఈ స్కిట్ లో వీరిరువురూ పెద్ద రౌడీ బ్యాచ్ కి లీడర్స్. వేదిక పైకి వచ్చి ఈ ఆడియో ఫంక్షన్ ను డిస్టర్బ్ చేస్తాం అని యాంకర్ సుమను బెదిరిస్తూ ఉంటే సుమ నిజంగానే ఆ బెదిరింపులకు భయపడినట్లు నటిస్తూ ‘అరవింద్ గారు రౌడీలు భయ పెడుతున్నారండీ’ అంటూ గట్టిగా అరిచి హడావిడి చేసింది.  ఈ విషయాన్ని చూసిన అరవింద్ ఈ కార్యక్రమంలో మరింత నవ్వులు తెప్పించాలనే ఉద్దేశ్యంతో ‘ఎవరమ్మా వాళ్ళు ఇండస్ట్రీలో నాకన్నా, దిల్ రాజ్ కన్నా పెద్ద రౌడీలు ఎవరున్నారు’ అంటూ తన పై తానే సెటైర్లు వేసుకునే సరికి కొద్ది నిముషాల సేపు శిల్పకళా వేదిక నవ్వులతో నిండి పోయింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: