మెగా స్టార్ చిరంజీవి, కొడుకు రామ్ చరణ్ కి కోపం తెప్పించినట్టుగా మీడియాలో కథనాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి 150వ సినిమా విషయంలో రామ్ చరణ్ కోపంగా ఉన్నాడంట. మేటర్ చిన్నదైనా, రామ్ చరణ్ చాలా సీరియస్ గా ఉన్నట్టుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. విషయంలోకి వెళితే చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన పనులు కొంత వరకూ వచ్చి, అక్కడ నుండి ఒక్క అడుగు కూడ ముందుకు వెళ్ళడం లేదు. దాదాపు చిరంజీవి నటించే 150వ సినిమా కథలో ఎన్ని మలుపులుంటాయో, మూవీ స్టార్ట్ కావడానికి సైతం అంతే మలుపులు ఉంటున్నాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా నిర్మాణంలో పలు మార్పులు చోటు చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ నుంచి దర్శకుడి వరకు ఇంతవరకు ఏదీ ఓకే కాలేదు. మూడు కథలు రెడీ చేశామని రామ్ చరణ్ చెప్పినప్పటికీ చిరంజీవి ఇంకా వాటి నుంచి ఏదీ ఫైనల్ చేయలేదట. ఆ మూడు కథలో ఏదో ఒకటి ఫైనల్ చేయాలని చిరంజీవిపై రామ్ చరణ్ ఒత్తిడి తీసుకువస్తున్నప్పటికీ, చిరంజీవి నుండి ఎటువంటి స్పంధన రావడంలేదంట. అలాగే, దర్శకుడిగా వినాయక్ పేరు మొదటి నుంచీ వినిపిస్తున్నప్పటికీ, ఇప్పుడు అది కూడా మరుగునపడింది. ఇన్నాళ్లూ వెయిట్ చేసిన వినాయక్ ఇప్పుడిక అఖిల్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రి కోసం కసరత్తులు చేస్తున్నాడు. దీంతో చిరంజీవి 150వ సినిమా ఓ కొలిక్కి రాకపోవడంతో చిరంజీవిపై రామ్ చరణ్ కోపంగా ఉన్నాడంటూ కథనాలు వస్తున్నాయి. అలాగే, చిరంజీవి తన 150వ సినిమాలో మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. తన రీ ఎంట్రీ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుందన్న విషయంపైనా, చిరంజీవి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తాజా సమాచారం. మొత్తానికి త్వరలోనే దీనిపై ఓ క్లారిటి వచ్చే అవకాశం ఉంటుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: