ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రకరకాల సమస్యలు ఉన్నాయి. అయితే రీసెంట్ గా తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో అన్ని రంగాల్లోనూ చీలికలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ ఒకటిగా ఉన్న టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక నుండి రెండు చీలిపోతుంది. అంతటితో సరిపెట్టుకోకుండా తెలంగాణ కల్ఛర్ ని పెంపోందించేందుకు మూవీలని నిర్మిస్తే అందులో టాక్స్ ని సైతం మినహాయింపు పొందవచ్చనే సంకేతాలు కూడ తెలంగాణ నిర్మాతలు, దర్శకులకి గవర్నమెంట్ నుండి వెళ్ళిందట. ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రాంతంకి చెందిన దర్శకులు, నిర్మాతలే, ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్కువ విభాగాల్లో నిండిఉన్నారు. ఇక నుండి తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీను కూడ బలంగా తయారుచేసేందుకు టీ.ఆర్.యస్ గవర్నమెంట్ ఆలోచనలు చేస్తుంది. ఇందులో భాగంగా అధిక సంఖ్యలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఔత్సాహిత దర్శకులు, నిర్మాతలు, హీరోలు, ఇతర ఆర్టిస్ట్ లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దర్శకులు తెలంగాణ ప్రాంతాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ తరహా నేటివిటి ఉన్న కథలను, మాటలను ఇతర సన్నివేశాలను రూపొందించేందుకు కసరత్తులు చేస్తున్నారు. మరో మూడు సంవత్సరాల్లో నవ్యాంద్రప్రదేశ్ లోని ఫిల్మ్ ఇండస్ట్రీకి, తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీల మధ్య వచ్చే సినిమాలలో చాలా వేరియేషన్ కనిపించనుంది. రెండు రాష్ట్రాలలో నుండి బయటకు వచ్చే అవుట్ పుట్ తెలుగే లాంగ్వేజే అయినప్పటికీ, పాత్రలో యాక్టర్స్ చెప్పె మాండలీకాలలో చాలా తేడా కనిపించనున్నాయి. మొత్తంగా తెలంగాణ ఫ్రాంతం కూడ ఎంతో చారిత్రక నేపధ్యం కలిగి ఉన్న రాష్ట్రం కాబట్టి, ఇక్కడి ప్రాంతీయతను ఆధారం చేసుకొని, లాభసాటిగా ఉండే సినిమాలను తీయాలని కొత్త దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి సరికొత్త యాక్టర్స్ వస్తే, ప్రస్తుతం ఉన్న లీడింగ్ యాక్టర్స్ కి కొంత కాంపీటీషన్ పెరిగే అవకాశం ఉందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: