గత రెండు రోజులుగా అనుష్క చేతికి గాయం అయింది అంటూ వెబ్ మీడియాలో వార్తల హడావిడి కనిపించింది. అయితే ఈ విషయానికి సంబంధించి గుణశేఖర్ క్లారిటీ ఇస్తూ తన ఫేస్ బుక్ లో అసలు విషయం బయటపెట్టాడు. అనుష్కకు తగిలిన గాయం ‘రుద్రమదేవి’ షూటింగ్ లో జరిగింది అన్న విషయాన్ని తెలియపరిచాడు.  ‘రుద్రమదేవి’ సినిమాకు సంబందించి యాక్షన్ సీన్స్ షూటింగ్ 40 రోజులు జరగాల్సి వుండగా 30వ రోజునాడు అనుష్కకి కుడి చెయ్యి మణికట్టు ఫ్రాక్చర్ అయిందట. గాయాన్ని పరీక్షించిన డాక్టర్ ఆమెకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే మంచిది అని సలహా కూడా ఇచ్చాడట. దీనితో గుణశేఖర్ ఈ యాక్షన్ సీన్స్ చిత్రీకరణ విషయంలో ఆమెను ఇబ్బంది పెట్ట కూడదని డూప్‌ను పెట్టు కోమ్మన్నాడట గుణశేఖర్.  అయితే ఆ విషయానికి ఒప్పుకొని బొమ్మాలి తానే స్వయంగా యాక్షన్ సీన్స్ లో పాల్గొని ఆ మిగతా 10 రోజుల షూటింగ్ కూడా పూర్తిచేసిందట. గాయాన్ని లెక్కచెయ్యకుండా మెడిసిన్స్ తీసుకుంటూ షూటింగ్ పూర్తిచేయడం చూసిన యూనిట్ సభ్యులు అనుష్క పట్టుదలకు ఆశ్చర్యపోయారట. అంతేకాదు తన చేతికి ఉన్న గాయపు కట్టును కెమెరాకు దొరకకుండా గాయమైన చోట స్కిన్ కలర్‌లో వుండే బ్యాండేజీని ఐదు చుట్లు చుట్టుకుని షూటింగ్ మొత్తం కానిచ్చిందట రుద్రమదేవి. ఇంత పట్టుదల ఉంది కాబట్టే ఈరోజు దక్షిణ భారత సినిమా రంగంలో రాజకుమారి పాత్రలకు చిరునామాగా అనుష్క మారిపోయింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: