వరస పరాజయాల తరువాత మహేష్ ఆ షాక్ నుండి తేరుకుని కొరటాల శివ దర్శకత్వంలో పూణేలో మొదలుపెట్టిన కొత్త సినిమా షూటింగ్ కు కోలీవుడ్ టాప్ హీరో విజయ్ సమస్యగా మారాడు అనే వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆరు రోజుల పాటు జరగడంతో పూనే లో శృతి,మహేష్ ల మీద సీన్స్ తీసారు దర్శకుడు. మూడు రోజుల పాటు టాకి తో పాటుగా ఒక పాటను దాదాపు 65% వరకు తీసాడని టాక్. ఎటువంటి అవాంతరం లేకుండా జరుగుతున్న ఈ షెడ్యూల్ ను మరి కొద్ది రోజులు పోడిగిద్దామని మహేష్, కోరటాలలు భావించినా శ్రుతి హాసన్ తన దగ్గర డేట్స్ లేవంటూ మహేష్ షూటింగ్ ను మధ్యలో ఆపుకుని హీరో విజయ్ తో చేస్తున్న ఫాంటసీ చిత్రo షూటింగ్ కు చెన్నై వెళ్ళిపోయిందని సంచారం.  అంతేకాదు మళ్ళీ తాను డిసెంబర్ మొదటి వారం వరకు మహేష్ సినిమా సెట్స్ వైపు రాలేనని తెగేసి చెప్పిందని సమాచారం. డిసెంబర్ లో కూడా కొద్ది రోజులు మాత్రమే తాను మహేష్ షూటింగ్ లో పాల్గొనగలనని అంటూ ఈ సినిమా నిర్మాతలు కోరుతున్న విధంగా బల్క్ డేట్స్ ఇవ్వలేనని శ్రుతి చెప్పిన సమాధానాలు మహేష్ కు షాకింగ్ గా మారాయి అని న్యూస్. కోలీవుడ్ హీరో విజయ్ తో శ్రుతి నటిస్తున్న భారీ సినిమాకు శ్రుతి ఒకేసారి బల్క్ డేట్స్ ఇవ్వడంతో ప్రస్తుతం మహేష్ శ్రుతుల ఈ డేట్స్ సమస్య ఏర్పడింది అంటున్నారు. ఈ సమస్య వల్ల మహేష్ కోరటాలల సినిమా అనుకున్నంత వేగంగా జరగక పోవచ్చని ఫిలింనగర్ టాక్. ఏమైనా మహేష్ కు శ్రుతి అనుకోని షాక్ ఇచ్చింది అనుకోవాలి..   

మరింత సమాచారం తెలుసుకోండి: