నిన్న విడుదలైన నారా రోహిత్ ‘రౌడీ ఫెలో’ సినిమాకు రివ్యూలు బాగా వచ్చినా రోహిత్ కోరుకునే హిట్ ను ‘రౌడీ ఫెలో’ అందుకోలేదేమో అనే వార్తలు వినపడుతున్నాయి. డైలాగ్స్ పరంగా ఈ సినిమా బాగున్నా కథలో నూతనత్వం లేక ఇప్పటికే అనేక సార్లు చూసిన సినిమాను కొత్త డైలాగ్స్ తో చూసిన భావన వస్తోంది అనే కామెంట్లు వినపడుతున్నాయి. అయితే ఈ వారం విడుదలైన ఆరు సినిమాలలో కలెక్షన్స్ పరంగా రోహిత్ ‘రౌడీ ఫెలో’ కు ఎడ్జ్ ఉంది అని టాలీవుడ్ విశ్లేషకుల వాదన. ఇక ఈ సినిమాలో రోహిత్ తన పెదనాన్నచంద్రబాబు ప్రస్తావనతో పాటు బాలకృష్ణ పేరును ఒక సీన్ లో వాడుకుంటే ఏకంగా ఎన్టీఆర్ విషుయల్స్ ను మరొక సీన్ లో వాడుకుని తన తెలుగుదేశ రాజకీయ నేపధ్యాన్ని వాడుకున్నాడు. అయితే ఆశ్చర్యకరంగా రోహిత్ తన సినిమాలో మెగా హీరోల ప్రస్తావన కూడా తీసుకు రావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈ సినిమా ఓపెనింగ్ సీన్ చిరంజీవి సినిమాలోని ‘అటు అమలాపురం’ పాటతో మొదలై ఆ తరువాత మరొక సీన్ లో అల్లుఅర్జున్ నటించిన ‘ఆర్యా’ సినిమా పోస్టర్ తో పాటు ఈ సినిమాలోని ఒక సన్నివేశం జరుగుతున్న సమీపంలోని ధియేటర్లో ‘అత్తారింటికి దారేది’ ప్రదర్శింపబడుతున్నట్లుగా చూపెట్టడం చూస్తూ ఉంటే రోహిత్ చాల తెలివిగా అటు నందమూరి ఇటు మెగా కుటుంబాలలోని హీరోలను కాకా పడుతూ తన కెరియర్ ప్లాన్ చేస్తునట్లు అర్ధం అవుతోందని కొందరి భావన.  అయితే అటు నందమూరి భజన ఇటు మెగా హీరోల పొగడ్తలు నారా రోహిత్ కు కోరుకున్న అదృష్టాన్ని ఈ ‘రౌడీ ఫెలో’ ఇవ్వలేదేమో అన్న మాటలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: