కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య ఒక్కసారిగా అభిప్రాయభేదాలు రచ్ఛకెక్కాయి. దీంతో ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఎవ్వరికి అంతుచిక్కకుండా ఉంది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న నడిగర్ సంఘం వివాదాలతో బజారుకెక్కుతోంది. కోలీవుడ్ స్టార్ హీరోశరత్‌కుమార్‌ కి హీరో విశాల్ మధ్య ఇప్పుడు పెద్ద వార్ జరుగుతుంది. ఏకంగా వీరిద్దరూ ఇప్పుడు ఒకరిపై ఒకరు తిట్టుకునేంతగా రచ్ఛ మొదలైంది. మేటర్ లోకి వెళితే, దాదాపు 70 ఏళ్ల చరిత్ర కలిగిన దక్షిణ భారత నటీనటుల సంఘమే నడిగర్ సంఘం. ఎందరో సీనియర్ నటులు ఈ సంఘానికి అధ్యక్షులుగా, కార్యనిర్వాహక సభ్యులుగా పనిచేశారు. చెన్నైలోని హబిబుల్లారోడ్ లో సుమారు 70 కోట్ల విలువచేసే స్థలం నడిగర్ సంఘం పేరిట ఉంది. ఈ ప్లేస్‌లో ఉన్న పాత నడిగర్‌ సంఘం భవనాన్ని కూల్చి భారీ స్థాయిలో మల్టీ ప్లెక్స్ లు నిర్మించేందుకు సంఘం సభ్యులు ఓ కార్పోరేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందంటై హీరో విశాల్ మండిపడ్డాలు. అంతే సంఘంలోని ఉన్నసీనియర్ సభ్యులపై విరుచుకుపడ్డాడు. సీనియర్లు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని విశాల్ రచ్చకెక్కాడు. అవసరమయితే ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించి మనమే మల్టీప్లెక్స్‌లు నిర్మించుకుందాం అంతేకానీ కార్పోరేట్ సంస్థకు అప్పగించాల్సిన అవసరమేమొచ్చిందని అంటూ మాటలను పేల్చాడు. అంతే కాకుంఆ సీనియర్లు, జూనియర్లను తొక్కేస్తున్నారని మండిపడ్డాడు. విశాల్ కామెంట్లతో నడిగర్‌ సంఘం కమిటీ అంతెత్తున లేచింది. 'కుక్కలు మొరుగుతుంటాయి పట్టించుకోకండి' అంటూ శరత్‌కుమార్‌, రాధారవి వంటి సీనియర్‌ నటులు ఫైరయ్యారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే నడిగర్ సంఘం నుంచి బహిష్కరిస్తామంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ విశాల్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో అభిమానుల మధ్య గంధరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుంతో అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: