మరొక నెలతో ముగిసి పోతున్న 2014 సంవత్సరం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు అలాగే హీరో నానీకి ఒక అరుదైన రికార్డును మిగిల్చిన సంవత్సరంగా ముగిసి పోతోంది. వరస పెట్టి మూడు సంవత్సరాలలో మూడు సూపర్ హిట్లను సొంతం చేసుకున్న మహేష్ స్పీడ్ కు ఈ సంవత్సరం తిరుగులేని బ్రేక్ వేసింది.  ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన ‘వన్’ ప్రయోగాత్మక చిత్రంగా మారి మహేష్ కు పరాజయాన్ని ఇచ్చింది. ఆ షాక్ నుండి తేరుకుని మాస్ మసాలా హిట్ గా ‘ఆగడు’ తో హడావిడి చేద్దామనుకున్నా అది కూడా జనానికి నచ్చకపోవడంతో వరసగా రెండు పరాజయాలను మూటకట్టుకున్న హీరోగా మహేష్ ఏర్పరచుకున్న రికార్డు మహేష్ అభిమానులనే గందరగోళంలో పడేసింది. ఈ పరిస్థుతుల నేపధ్యంలో వచ్చే సంవత్సరం జూన్, జులై ల వరకు మహేష్ కు సంబంధించిన హడావిడి టాలీవుడ్ లో ఎక్కడ కనిపించదు. ఇక మహేష్ అడుగులలో అడుగులు వేస్తూ తాను కూడా మహేష్ లాగే ఫైల్యూర్ రికార్డులను క్రియేట్ చేయగలనని నిరూపిస్తూ నానీ కూడా ఈ లిస్టులో చేరిపోయాడు. ఈ సంవత్సరం విడుదలైన ‘పైసా’, ‘ఆహా కళ్యాణం’ వరస పరాజయాల రికార్డుతో నాని నటించిన ‘జెండా పై కపిరాజు’ విడుదలకు రెడీ అయి ఎన్నో నెలలు గడిచిపోతున్నా ఈ సినిమాను కొనడానికి బయ్యర్లు ముఖం చాటేస్తున్నారు అంటే నాని పరిస్థితి ఏస్థితిలో ఉన్నదో అర్ధం అవుతుంది. ఈవిధంగా మరి కొద్ది రోజులలో ముగిసి పోతున్న 2014 సంవత్సరం మహేష్, నానీల కెరియర్లకు ఒక పీడకలలా మిగిలి పోతుంది అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు. వచ్చే సంవత్సరం కూడా ఇదే రికార్డును వీరిద్దరూ కొనసాగిస్తే పెరిగి పోయిన పోటీ పరిస్థుతుల నేపధ్యంలో మంచి నటులుగా పేరుండి కూడా వీరిరువురు టాలీవుడ్ రేస్ లో బాగా వెనక పడిపోతారు అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: