మహేష్ హీరోయిన్ గా ‘వన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ తన తొలి ప్రయత్నం విజయవంతం కాకపోవడంతో సైడ్ బిజినెస్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. పబ్లిక్ ప్లేసులలో మీడియా కెమెరాల ముందు హీరోలకు గెడ్డాలు గీసే కార్యక్రమం చేపట్టింది.  ప్రముఖ రేజర్ల తయారి సంస్థ జిలెట్ కు జాతీయ స్థాయిలో బ్రాండ్ అంబాసిడర్ గా ఆ కంపెనీ ప్రోడక్స్ ను ప్రమోట్ చేస్తోంది. దీనికోసం ఈమధ్య చెన్నైలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కృతి తన చేతిలో జిలెట్ రేజర్ ను పుచ్చుకుని హీరో సిద్దార్థ్ కు గెడ్డం గీస్తున్నట్లుగా కెమేరాకు పోజులు ఇస్తూ చాల హడావిడి చేసింది. అంతేకాదు సిద్దార్థ్ ముఖానికి ఫోమ్ రాశి ఏకంగా జిలెట్ రేజర్ తో నిజంగానే గెడ్డం గీద్దామని కృతి సనన్ ప్రయత్నించడంతో సిద్దార్ద్ తన అందమైన మొఖానికి ఎక్కడ గాట్లు పడతాయో అని నానా పాట్లు పడ్డాడు సిద్దార్ద్. ప్రస్తుతం నాగచైతన్యతో సినిమా చేస్తున్న కృతి సనన్ కు ఆ సినిమా కూడా కలిసి రాకపోతే ఇక ఇలా ప్రతి పట్టణంలోను హీరోలకు షేవింగ్ చేసే కార్యక్రమాలను చేపడుతూ రోజులు గడపడానికి ముందుగానే ఆలోచించుకుని జిలెట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సెటిల్ అయిపోతుంది కాబోలు..  

మరింత సమాచారం తెలుసుకోండి: