నిన్నటి రోజున విడుదలైన పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ పై టాలీవుడ్ ప్రముఖులందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో విడుదలైన ఏ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఈ స్థాయిలో ముక్త కంఠo తో ప్రశంసల వర్షం కురిసిన సందర్భం లేదు. పవన్ అభిమానులే కాకుండా అందరి హీరోల అభిమానాన్ని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పొందగలిగింది.  ఈ అవకాశాన్ని ఏమాత్రం జారవిడుచుకోకుండా తాను కూడా ఉన్నాను అంటూ రేణుదేశాయ్ పవన్‌కల్యాణ్ గోపాలుడి అవతారం పై ప్రతిస్పందించిoది. ‘పర్‌ఫెక్ట్ పోస్టర్ ఫర్ పర్ ఫెక్ట్ పర్సన్' అంటూ తన మనసులోని అభిప్రాయాన్ని వెలుబుచ్చింది. నిర్మలమైన దివ్యమైన లుక్ ఆయనకు మాత్రమే సాధ్యం అంటూ పవన్ పై ప్రశంసలను కురిపించింది.  మొన్న ఫుట్ బాల్ గేమ్ ఆడుతున్న అకిరా నందన్ ఫోటోను తన ట్విటర్ లో పెట్టి హడావిడి చేసిన రేణు పట్టుమని రెండు రోజులు గడవకుండానే మళ్ళీ పవన్ నిర్మలమైన లుక్ విషయంలో తన అభిప్రాయాన్ని తెలపడం బట్టి అవసరం ఉన్నా లేకున్నా ఎదో విధంగా పవన్ నామస్మరణతో రోజులు గడిపే వ్యూహాత్మక ఎత్తుగడలో రేణుదేశాయ్ ఉందా అని ఈ కామెంట్లు చూసిన ఎవరికైనా అనిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: