ఢిల్లీ బ్యూటీ తాప్సీని టాలీవుడ్ లో సెటిల్ చేయడానికి మంచు వారి కుటుంబం అంతా ఎంత ప్రయత్నించిoదో అందరికీ తెలిసిన విషయమే. మనోజ్, విష్ణు, లక్ష్మి ఇలా అందరి సినిమాలలోను తాప్సీ నటించినా కొద్దిపాటి అదృష్టం కూడా తాప్సీకి లేకపోవడంతో ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో తన అదృష్టాన్ని వెతుక్కుంటోంది.  సామాన్యంగా మన యంగ్ హీరోలు తమ సినిమాలకు హీరోయిన్స్ గా బ్యూటీలను ముంబాయ్ నుండి కాని లేదంటే కేరళ నుండి కాని దిగుమతి చేస్తూ ఉంటారు. అయితే మంచు విష్ణు తన హీరోయిన్ ను బెంగాల్ నుండి దిగుమతి చేస్తున్నాడు. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రస్తుతం విష్ణు దేవకట్టా దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ సినిమాకు బెంగాల్ బ్యూటీ త్రిధ చౌదరిని ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈసినిమాకు విష్ణు పక్కన హీరోయిన్ గా ఆదా శర్మను అనుకున్నా అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఇప్పుడు ఈ బెంగాల్ బ్యూటీకి విష్ణు ఓటు వేయడం హాట్ న్యూస్ గా మారింది. తమిళంలో హిట్టయిన ‘అరిమ నంబై’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విష్ణుకు కనీసం ఈ సినిమా అయినా కలిసి వస్తే త్రిధ చౌదరి మంచు కుటుంబం తీయబోయే సినిమాలకు చిరునామాగా మారే అవకాశం ఉంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: