‘లింగ’ సినిమాను దర్శకత్వం వహించిన కెఎస్ రవికుమార్ రజినీకాంత్ సూపర్ స్టార్ ఇమేజ్ పై అశక్తికర వ్యాఖ్యలు చేసాడు. ‘లింగ’ సినిమా క్లైమాక్స్ లో రాజినీతాంత్ ఆకాసంలో ఎగురుతున్న బెలూన్ ను అందుకుని ఆ సినిమా విలన్ జగపతి బాబుతో చేసిన ఫైట్ కు సంబంధించి వస్తున్న విమర్శల పై తనదైన రీతిలో స్పందించాడు.  హాలీవుడ్ లో దాదాపు 1500 కోట్ల ఖర్చుతో తీసిన సూపర్ మేన్, స్పైడర్ మేన్, ఎక్స్ మేన్, బ్యాట్ మేన్ పాత్రలు ఆకాశంలో ఎగురుతూ సాహసాలు చేస్తున్నప్పుడుచూసి ఆనందపడే ప్రేక్షకులు సూపర్ స్టార్ రజినీకాంత్ బెలూన్ పైకి ఎగిరి ఆ విలన్ తో ఫైట్ చేస్తే తప్పు ఏమిటీ అని తన పై విమర్శలు చేస్తున్న వారి పై ఎదురుదాడికి దిగుతున్నాడు.  ఇంగ్లీష్ సినిమాలలో స్పైడర్ మేన్ సాహసాలను చూసి ముచ్చట పడే ప్రేక్షకులు అదే సాహసాలను రాజినీకాంత్ చేత చేయిస్తే విమర్శించడం చూస్తూ ఉంటే తనకు రజినీకాంత్ సూపర్ స్టార్ కాదా అని అనుమానం వస్తోందని సెటైర్లు వేస్తున్నాడు రవికుమార్. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలోని కొన్ని డైలాగుల పై అభ్యంతరం చెపుతూ భట్రాజు సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ సినిమా దర్శక నిర్మాతల పై కేసు వేయడం బట్టి ‘లింగ’ ఏ స్థాయిలో హిట్ అయిందో అన్న విషయాన్ని పక్కకు పెడితే ఈరోజు వరకు కూడా ‘లింగా’ ని కేసులు వెంటాడుతూనే ఉన్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: