హీరో నాగార్జున దృష్టి సూపర్ స్టార్ కృష్ణ సెంటిమెంట్ పై పడింది అనే వార్తలు వస్తున్నాయి. నాగార్జున కుమారుడు అఖిల్ సినిమా షూటింగ్ కు రెడీ అవుతూ ఉండటంతో నాగ్ ఆలోచనలను ఈ సెంటిమెంట్ ప్రభావితం చేస్తోంది అనే వార్తలు వినపడుతున్నాయి. ఇక వివరాలలోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబు నటించిన మొదటి సినిమా ‘రాజకుమారుడు’ లో కృష్ణ ఒక చిన్న పాత్రలో గెస్ట్ గా కనిపించి అప్పట్లో సంచలనం కలిగించాడు. కృష్ణ ఈ సినిమాలో చిన్న పాత్రలో నటిస్తున్నాడు అనే విషయాన్ని అప్పట్లో సీక్రెట్ గా ఉంచి సినిమా విడుదల అయ్యాక అందర్నీ ఆశ్చర్య పరిచారు.  ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ నాగార్జున అఖిల్ నటించబోతున్న తొలి సినిమాలో గెస్ట్ గా ఒక చిన్న పాత్ర చేస్తే బాగుంటుంది అని ఈ సినిమా దర్శకుడు వినాయక్ చేసిన సూచన పై ఆలోచన చేస్తున్నాడని టాక్. గతంలో తన పెద్ద కుమారుడు నాగచైతన్య నటించిన ‘జోష్’ సినిమాలో ఇటువంటి ప్రయోగాన్ని చేయని నాగార్జున తన అక్కినేని అభిమానుల ఆనందం కోసం ఒక గెస్ట్ పాత్రను అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా పోషించి తన అభిమానులకు షాక్ ఇస్తాడా అన్నది ఇప్పటికి సమాధానంలేని ప్రశ్న అనుకోవాలి. అయితే మహేష్ మొదటి సినిమాకు కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించడం కలిసి వచ్చిన నేపధ్యంలో ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ నాగార్జున తన చిన్న కుమారుడు అఖిల్ కోసం ఈ ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు..    

మరింత సమాచారం తెలుసుకోండి: