సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఇప్పటికే 2015 సంక్రాంతికి ఏ మూవీలు రిలీజ్ లు అవుతున్నాయి అనే దానిపై ఓ క్లారిటి వచ్చింది. దీంతో ఆ మూవీలకి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ ని స్టార్ చేశారు. అయితే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ పొంగల్ రిలీజ్ మూవీగా ఐ సిద్ధంగా ఉంది. భారీ చిత్రాల శంకర్ మరో భారీ సృష్టి ‘ఐ’. దాదాపుగా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ని కూడ పూర్తి చేసుకుని జనవరి 9న విడుదల కు సిద్దం కానుంది. ఇదిలావుండగా ‘ఐ’ తెలుగు వెర్షన్ టాలీవుడ్ లో ఎంతో సందడి సృష్టిస్తుంది. మొత్తంగా సంక్రాంతికి ఐ మూవీ స్టార్ ఐకాన్ గా నిలవనుంది. ఇదిలాఉంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంక్రాంతికి మల్టీస్టారర్ మూవీ గోపాల గోపాల రిలీజ్ అవుతుంది. గోపాల గోపాల మూవీ లో పవన్ కళ్యాణ్, వెంకటేష్ లు నటించడంతో ఈ మూవీపై కూడ భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఐ మూవీ, గోపాల గోపాల మూవీలు రెండూ ఠఫ్ కాంపిటీషన్ ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా గోపాల గోపాల మూవీ కంటే ఐ మూవీని చూడటానికే ఎక్కువ మంది ప్రాముఖ్యత చూపుతున్నట్టుగా టాలీవుడ్ లోని కొన్ని సెంటర్స్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఐ మూవీ, గోపాల గోపాల మూవీతో సరిసమానంగా బిజెనెస్ చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం వైజాగ్ మరియు గుంటూరు పంపిణీ హక్కులు 4 మరియు 3.6 కోట్లకు అమ్ముడయ్యాయి. కృష్ణ హక్కులు 2. 25 కోట్లకి అమ్ముడవ్వగా తూర్పు గోదావరి హక్కులు 3 కోట్లకి అమ్ముడయ్యాయి. కొంత మంది డిస్ట్రిబ్యూటర్స్ గోపాల గోపాల మూవీ కంటే ఐ మూవీని తీసుకోవటానికే ఆసక్తి చూపుతున్నారంట. దీంతో సంక్రాంతికి రిలీజ్ కానున్న మల్టీస్టారర్ మూవీ గోపాల గోపాల కి ఐ చుక్కలు చూపిస్తుందనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: