ప్రస్తుతం జాస్మిన్ డిసౌజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బాలీవుడ్ సినిమాలో రానా దగ్గుబాటి సరసన సన్నీ నటిస్తోంది. అలాగే 'వన్ నైట్ స్టాండ్' సినిమా కోసం సన్నీలియోన్ డ్యాన్స్ ని సైతం కష్టపడి నేర్చుకుంది. ఈ విషయాన్ని సన్నీలియోన్ పదే పదే చెప్పుకుంటూ వస్తుంది. గతంలో "ఇప్పుడే లాస్ ఏంజిల్స్ నుంచి వచ్చాను. కాస్సేపట్లో 'వన్ నైట్ స్టాండ్' సినిమా పాట రిహార్సల్స్ కి వెళ్లాలి" అంటూ ట్వీట్ చేసి హంగామా క్రియేట్ చేసింది. తను ఏం చేసినా, అది రానాకి లింక్ పెడుతూ వచ్చేది. ఎందుకంటే వన్ నైట్ స్టాండ్ మూవీలో సన్నీ సరసన నటించేది మామూలు వ్యక్తి కాదు. సన్నీకి కరెక్ట్ జోడి అంటూ బిటౌన్ హాట్ టాపిక్ గా మారిపోయిన ఆ హీరో దగ్గుబాటి రానా. సన్నీలియోన్ తో నటిస్తున్న రానా పై బిటౌన్ లోనూ తెగ క్రేజ్ ఏర్పడుతుంది. అయితే, సన్నీలియోన్ కి రానా ఝలక్ ఇచ్చినట్టు సమాచారం. కొంతకాలంగా 'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాలతో బిజీగా ఉన్న రానా ఇపుడు కాస్త ఫ్రీ అయ్యాడు. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్2తో " బేబీ " మూవీలో నటిస్తున్న రానా.. ఆ తరువాత సోలో హీరోగా మరో మూవీకి సైన్ చేసిన విషయం తెలిసిందే. అదే సన్నీలియోన్ తో నటించబోతున్న వన్ నైట్ స్టాండ్. అయితే ప్రస్తుతం రానా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. ముందుగా ఒప్పుకున్న ఆ సన్నీలియోన్ చిత్రాన్ని ఇప్పుడు చేయలేనంటూ, చిత్ర దర్శకుడికి క్లారిటి ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. త్వరలోనే రానాకి సంబంధించిన షెడ్యూల్ కూడ ఉంది. చివరి నిముషంలో తను సన్నీలియోన్ సరసన నటించడంలేదంటూ తేల్చి చెప్పడంతో, ప్రస్తుతం చిత్రయూనిట్ లో కొంత అలజడి మొదలైంది. దీంతో సన్నీలియోన్ సరసన మరో కొత్త యాక్టర్ కోసం చిత్ర యూనిట్ అప్పుడే సెర్చింగ్ మొదలు పెట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: