అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న మరో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అఖిల్ నిన్న ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేటితరం యంగ్ హీరోల డాన్సింగ్ స్కిల్స్ పై కామెంట్లు విసిరాడు. ప్రస్తుతం జనరేషన్ లో ఉన్న యంగ్ హీరోలు చాలామంది నెచురల్ డాన్సర్స్ అని అంటూ వారిని తట్టుకోవడానికి తాను గత కొద్ది సంవత్సరాలుగా డాన్స్ నేర్చుకుంటున్నాని అంటూ తాను నెచురల్ డాన్సర్ కాకపోయినా వారితో పోటీ ఇవ్వడానికి ఏమాత్రం తగ్గకుండా తాను విపరీతంగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నానని అయితే తన టాలెంట్ ఏమిటి అన్నది ప్రేక్షకులు నిర్ణయిస్తారని అభిప్రాయ పడ్డాడు.  ఇప్పటిదాకా తాను రెండు వాణిజ్య ప్రకటనలలోను, ‘మనం’ సినిమాలోను నటించినా వీటిలో ఎక్కడా కూడా తన క్లోజప్ సీన్స్ లేవని కేవలం తన బాడీ లాంగ్వేజ్ ని మాత్రమే చూపెట్టిన నేపధ్యంలో తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకోవలసిన అవసరం ఉంది అని అన్నాడు. తన తల్లి తండ్రుల గురించి మాట్లాడుతూ అమ్మలోని స్వీట్ నెస్ నాన్నలోని ఫ్రాంక్ నెస్ తనకు ఇష్టం అని అన్నాడు. సినిమా నటుల డేటింగ్ వ్యవహరాల పై వచ్చే వార్తలు గురించి మాట్లాడుతూ సినిమా సెలెబ్రెటీల జీవితాలు 90% అందరికీ తెలిసిపోతూనే ఉంటుందని కేవలం వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆ పది శాతంలో కూడా వారి స్వేచ్ఛకు సంబంధించిన విషయాలు ఈ డేటింగ్ వ్యవహరాలనీ అంటూ వాటిని మీడియా భూతద్దంలో ఎందుకు చూస్తుందో తనకు తెలియడం లేదు అని అన్నాడు.  ఇక హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ తాను బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనెకు వీరాభిమానని అంటూ తాను ఆమెతో నటించాలని ఉన్నా కుదరదు కదా అని తన పై తానే సెటైర్ వేసుకున్నాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: