టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి వరుస ఆఫర్స్ రావాలంటే, మెగా హీరోలను బుట్టలో వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే, ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాహీరోల జోరు కొనసాగుతుంది. అలాగే వీరి సంఖ్య కూడ ఎక్కువుగానే ఉంది. తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇస్తున్న హీరోయిన్స్ లో, ఎక్కువ మంది మెగా హీరోలను ఇంప్రెస్ చేయటానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా వరుణ్ తేజ్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయి బ్యూటీ పూజగా హెడ్గే. పూజా హెడ్గె తన రెండవ మూవీతోనే మరో మెగా హీరో సరసన ఆఫర్ కొట్టేసింది. దీనికి సంబంధించిన న్యూస్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లియర్ గా వినిపిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని. ఈ మూవీలో హీరోయిన్ గా తీసుకోవటానికి చిత్ర యూనిట్ చాలా మందికి ఆడిషన్స్ ని నిర్వహించింది. అయితే ఫైనల్ గా వరుణ్ తేజ్ సరసన నటించిన హీరోయిన్ పూజాహెడ్గెని కోరటాల శివ తీసుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఈ మూవీ అనంతరం అల్లుఅర్జున్, కొరటాల శివ మూవీలో నటించడం ఖాయం అని మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం. పూజాహెడ్గె కూడ అల్లుఅర్జున్ మూవీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఫిల్మ్ ఇంస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: