వెండితెర మన్మధుడు నాగార్జున పవన్ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాడు అనే వార్తల హడావిడి ఫిలింనగర్ లో మొదలు అయ్యింది. ఈ మధ్యనే తొలి క్లాపింగ్ తో పట్టాలు ఎక్కిన అఖిల్ సినిమాలో ఆసినిమాకధకు ట్విస్ట్ ఇచ్చే ఒక ముఖ్య పాత్ర ఉందట. మొదట్లో ఈపాత్రను ఎవరైనా సీనియర్ నటుడిచేత చేయిద్దాం అనుకుఉన్న నేపధ్యంలో మధ్యలో ఆపాత్రను నాగార్జున చేస్తే బాగుంటుంది అనే ఆలోచన కూడా ఈ సినిమా నిర్మాతలకు వచ్చింది అనే వార్తలు వస్తున్నాయి.  అయితే లేటెస్ట్ గా ఈ సినిమాను నిర్మిస్తున్న నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి వచ్చిన ఒక ఆలోచన ఈసినిమా యూనిట్ అందరికీ నచ్చడంతో ఆఆలోచన అమలుపరిచే బాధ్యతను దర్శకుడు వినాయక్ కు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వివరాలలోకి వెళితే అఖిల్ సినిమాలోని ఆముఖ్యమైన పాత్రను పవన్ కళ్యాణ్ చేత చేయించాలని ఈసినిమాను నిర్మిస్తున్న నితిన్ కుటుంబసభ్యుల ఆలోచనట. అయితే ఈప్రత్యేక పాత్రకు పవన్ ను ఒప్పించడం అంత సులువైనవ్యవహారం కాదు కాబట్టి పవన్ కు సన్నిహితంగా ఉండే ఈసినిమా దర్శకుడు వినాయక్ ను ఏదోవిధంగా పవన్ ను అఖిల్ సినిమాలో ప్రత్యేక పాత్రవిషయoలో ఒప్పించడానికి వినాయక్ పై ఒత్తిడి పెంచుతున్నట్లు టాక్. ఈ సూచన వినాయక్ కు కూడా నచ్చడంతో ఎప్పడినుంచో తనకు పవన్ తో సినిమాచేయాలి అన్న ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈప్రత్యేక పాత్రకు మరింత ప్రాముఖ్యత పెంచి త్వరలోనే పవన్ ను కలిసే ఉద్దేశ్యoలో ఉన్నాడట వినాయక్. ‘గోపాల గోపాల’ సినిమాకు పవన్ చేరికవల్ల ఆసినిమాకు ఏర్పడిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని అఖిల్ సినిమా నిర్మాతలు వేస్తున్న ఈఎత్తుగడ బిజినెస్ పరంగా మంచిఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నా టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ ను ఒప్పించడం అంతతేలిక కాదు. కానీ అటువంటి అద్భుతమే జరిగితే వచ్చేసంవత్సరం విడుదలకాబోయే అఖిల్ సినిమా సరికొత్త సంచలనానికి శ్రీకారం చుడుతుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: