ఇప్పటి వరకు దేవుళ్ళను టార్గెట్ చేసిన వర్మ ఈసారి ఏకంగా తన గురి రజినీకాంత్ వైపు తిప్పి కోలీవుడ్ మీడియాలో సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న శంకర్ ‘ఐ’ సినిమా ట్రైలర్ ను పొగడడానికి వర్మ దగ్గర ఉన్న మాటలు చాలక ఏకంగా వర్మ రజినీకాంత్ ను టార్గెట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.  వర్మ శంకర్ ‘ఐ’ సినిమా ట్రైలర్ పై తన ట్విటర్ లో తనదైన విలక్షణ రీతిలో కామెంట్స్ పెట్టాడు. ‘ఐ’ సినిమా ట్రైలర్ చూసిన తరువాత తాను ఒక సాధారణ వ్యక్తిగా ఆలోచిస్తే తనకు రజినీకాంత్, జయలలిత కన్నా శంకర్ తమిళనాడులో గొప్ప వాడుగా తనకు అనిపిస్తోందని అందుకే తాను శంకర్ వీరాభిమానిగా మారిపోయాననీ షాకింగ్ ట్విట్ చేసాడు వర్మ. అంతేకాదు బాలీవుడ్ లో టాప్ హీరోలు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి ప్రముఖ హీరోల పై దర్శకుల కెరియర్ ఆధారపడి నడుస్తూ ఉంటే శంకర్ మాత్రం దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోల ఇమేజ్ కు ముఖ్యంగా రజినీకాంత్ క్రేజ్ కు గ్రహణంగా మారబోతున్నాడు అంటూ వర్మ తన ట్విటర్ లో శంకర్ ను ఆకాశానికి ఎత్తేశాడు.  అయితే ఈ కామెంట్స్ ను చదివిన రజినీ వీరాభిమానులు మాత్రం ప్రస్తుతం వర్మను విపరీతంగా ద్వేషిస్తున్నారని టాక్. ద్వేషంగా అయినా తన పాపులారిటీ పెంచుకోవాలని వర్మ ఈ కొత్త ఎత్తుగడ ఎంచుకున్నాడు అని అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: