నటించిన మొట్టమొదటి సినిమా ‘అల్లుడి శీను’ తో నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన బెల్లం కొండ శ్రీనివాస్ కెరియర్ అనుకున్నంత స్పీడ్ గా నడవడంలేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రెండవ సినిమా పట్టాలు ఎక్కినా అనుకున్నంత స్పీడ్ వెళ్ళడంలేదు. ఈ నేపధ్యంలో రవితేజ, సునీల్ లు కాదన్న ఒక సినిమాకు బెల్లంకొండ శ్రీనివాస్ ఓకె చెప్పాడు అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  గత రెండు సంవత్సరాలుగా దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు రవితేజాతో కాని సునీల్ తో కాని తీస్తాడు అనుకున్న తమిళ సూపర్ హిట్ ‘సుందరపాండ్యన్’ తెలుగు రీమేక్ లో బెల్లంకొండ శ్రీను హీరోగా చేయడానికి అంగీకరించాడు అని టాక్. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఈసినిమా అప్పట్లో కోలీవుడ్ లో సంచలనాలు సృష్టించింది. ఈసినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం అనేక మంది నిర్మాతలు పోటీ పడినా భీమినేని శ్రీనివాసరావు ఈ రీమేక్ హక్కులను అతి చాకచక్యంగా అప్పట్లో సంపాదించాడు అనే టాక్ ఉంది. ‘సుడిగాడు’ లాంటి సూపర్ హిట్ సినిమాకు దర్శకత్వం వహిoచాక కూడా టాలీవుడ్ లో భీమినేనికి డిమాండ్ పెరగలేదు. దీనితో ఈ దర్శకుడు ఈ సినిమా రీమేక్ కు సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాలేదు అనే మాటలు ఉన్నాయి.  అయితే ప్రస్తుతం క్రేజ్ లేని భీమినేని, అదేవిధంగా పేరు వచ్చినా అవకాశాలు రాని బెల్లంకొండ కలిసి ఒక తమిళ రీమేక్ ను నమ్ముకుని చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు విజయవంతం అవుతాయో వచ్చే సంవత్సరం తేలుతుంది..    

మరింత సమాచారం తెలుసుకోండి: