టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మరో కొత్త తరం యంగ్ హీరో రాబోతున్నాడు. తనే అక్కినేని అఖిల్. ఈ విషయం మనకు గతంలోనే తెలుసు. అయితే ప్రస్తుతం అక్కినేని అఖిల్ నటిస్తున్న మూవీపై ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త టాక్స్ వినిపిస్తున్నాయి. అఖిల్ నటిస్తున్న మూవీలో మరో అక్కినేని హీరో కూడ కనిపిస్తున్నాడనే క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే అఖిల్ డెబ్యూగా వస్తున్న మూవీలో నితిన్ స్క్రీన్ స్పేస్ ని పంచుకొని, మూవీ పై క్రేజ్ ని క్రియేట్ చేశాడు. అంతే కాకుండా అఖిల్ డెబ్యూ మూవీకి దర్శకుడిగా వినాయక్ పనిచేయడం అనేది కూడ మూవీపై క్రేజ్ ని క్రియేట్ చేస్తుంది. ఇన్ని ప్రత్యేక విషయాలు అఖిల్ డెబ్యూ మూవీలో ఉండటం ఓ న్యూస్ అయితే, ఇందులో సరికొత్తగా మరో అక్కినేని హీరో కనిపించడం అనేది మరో న్యూస్ లా కనిపిస్తుంది. ఇంతకీ అఖిల్ డెబ్యూలో కనిపించే హీరో ఎవరా అని అనుకుంటారా? ఇంకెవరూ నాగచైతన్యనే. తమ్ముడు డెబ్యూగా వస్తున్న మూవీలో అన్న నాగచైతన్య కనిపిస్తున్నాడంటూ టలీవుడ్ లో క్లియర్ టాక్స్ వినిపిస్తుంది. అఖిల్ డెబ్యూ మూవీలో నాగచైతన్య కూడ కనిపించాలనుకోవడం అనేది, నాగచైతన్య వ్యక్తిగత నిర్ణయంగా అన్న పూర్ణ కాంపౌండ్ నుండి వినిపిస్తున్న సమాచారం. వినాయక్ ఇప్పటికే అఖిల్, నాగాచైతన్యలకి సంబంధించిన సీన్స్ ని కూడ క్రియేట్ చేశాడని అంటున్నారు. మొత్తంగా అఖిల్ డెబ్యూ మూవీలో ఈ ఇద్దరు అన్నదమ్ములు స్క్రీన్ పై కనిపిస్తే, నిజంగా అది అభిమానులకి పండుగే అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: