ఒక్కటి కూడా లేకుండా సినిమా తియ్యడం ఒక్కటి కూడా లేకుండా సినిమా తియ్యడం ఈ విభాగానికి గ్రంథం ఈ చిత్రం

భక్తవత్సల నాయుడు (మోహన్ బాబు) అనుకోని పరిస్థితుల్లో సూర్య కాంతం (మీనా) మరియు ప్రియం వధ(రమ్య కృష్ణ) ని ఒకరికి తెలియకుండా మరొకరిని  పెళ్లి చేసుకుంటాడు. నాయుడు కి సూర్య కాంతం కి శృతి(పూర్ణ) కూతురు. నాయుడు ప్రియం వధకి గౌతం నాయుడు(వరుణ్ సందేశ్) కొడుకు.  నాయుడు కి ఇద్దరు భార్యలు అని వీరిలో ఎవరికీ తెలియకుండా ఇస్మాయిల్(అలీ) సహాయం తో నెట్టుకొస్తున్న నాయుడు జీవితం లో కి ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఊరి నుండి పారిపోయి వచ్చిన బాలరాజు(అల్లరి నరేష్) ప్రవేశిస్తాడు.. తరువాత ఎం జరిగింది అని ఆసక్తి కలిగి చూడగలిగే శక్తి ఉంటే తెర మీద చూసి తెలుసుకోండి..

మోహన్ బాబు గారి స్థాయికి తగ్గ  పాత్ర కాదు ఇది, అయన నటన కూడా అలానే ఉంది. నిజానికి పూర్తిగా అభివృద్ధి చెయ్యని పాత్రలో అయన కనబరిచిన ప్రదర్శనే ఆ మాత్రం అయిన కాపాడింది అని చెప్పుకోవచ్చు. ఇకపోతే అల్లరి నరేష్ ఈ చిత్రంలో కనీసం పది సన్నివేశాలలో కూడా పూర్తిగా కనపడలేదు అయన ఎనర్జీ తో కొన్ని సన్నివేశాలను కాపాడాలి అనే ప్రయత్నం చేసారు కాని అప్పటికే చేతులు దాటిపోయిన కథనానికి అది  ఏమాత్రం సహాయపడలేదు. మీనా, రమ్య కృష్ణ పాత్రలకి ఎమోషన్ సన్నివేశాలు రాసుకోవల్సింది.. వివరం లేని పాత్రలుగా మిగిలిపోయాయి వీరి ఇరువురివి... వరుణ్ సందేశ్ పాత్ర ఏంటి అనేది చేసిన అతనికి రాసిన రచయితకి చూసిన మనకి ఇలా ఎవరికీ అర్ధం కాని పాత్ర ఇది..  అతని ప్రదర్శన కూడా అంతే గందరగోళంగా ఉంటుంది. పూర్ణ పాత్ర ఆమె నటన ఏదో ఉన్నాయి అంతే.. అలీ తన టైమింగ్ తో కామెడీ చెయ్యాలని ప్రయత్నం చేసారు కాని ఇలాంటి ఆలిని ఇదే రకమయిన కామెడీ ని ఇప్పటికే పలుమార్లు తెర మీద చూడటం మూలాన ఇది ఆకట్టుకోలేదు.. ఇంకా ఈ చిత్రంలో ఓపిక ఉంటే తెర ముందు కూర్చొని లెక్కపెట్టుకోగలిగినన్ని అవసరం లేని, అర్ధం లేని పాత్రలు.. నటులు చాలామంది ఉన్నారు.. చెప్పుకోడం వృధా ప్రయాస.. 



ముందుగా హెచ్చరిక తో మొదలు పెడితే ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ సాంకేతిక అంశం ఒక్కటి కూడా కనబడదు. కథనం దగ్గర మొదలు పెడితే సన్నివేశానికి సన్నివేశానికి సంభంధం లేకపోతే ఏ సన్నివేశంలో ఎవరు ఉంటే ఏంటి , పగద్భందీగా లేని పిడికిలిలో ఇసుమంతయినా ఏదీ ఇమడదు ఈ చిత్రం కూడా అంతే కథనం కరెక్ట్ గా లేకపోతే ఎవరేం నటించినా ఎవరెంత కష్టపడిన నీటిలో కలిపేసిన బూడిద ... కథ అనేది కనీసం నామమాత్రానికి అయినా కనిపించదు... శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వానికి ఒక గమ్యం అంటూ కనపడదు ఎలా పడితే అలా సన్నివేశాలు తీసేసి ఎడిటర్ కి ఇస్తే ఏదో ఒకలా అతికించి తెర మీదకి తెచ్చినట్టు అనిపిస్తుంది ఈ చిత్రాన్ని చూస్తుంటే కనీసం విలువయిన సన్నివేశం ఒక్కటి కూడా కనపడదు. పరిస్థితిలు కోరుకునేంత ఎమోషన్ పండించకుండానే మరో సన్నివేశానికి వెళ్ళిపోవడం టైమింగ్ పూర్తిగా లేకుండా కామెడీ ప్రయత్నించడం.


ఈ చిత్రంలో అయన చెయ్యని తప్పంటూ లేదు. సినిమాటోగ్రఫీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు, గౌతం రాజు ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉండవలసింది అనవసరమయిన సన్నివేశాలన్నీ కత్తిరించేస్తే చిత్రం చిన్నదయిపోతుందని  అయన పడ్డ మొహమాటం తెర మీద క్లియర్ గా కనిపిస్తుంది.. మాటలు అందించిన శ్రీధర్ సీపాన సీరియల్స్ కోసం రాసుకున్న మాటలని కథనంలో కలిపేసారు. ఎమోషనల్ కామెడీ రొమాంటిక్ ఇలా ఎందులోనూ ఒక్క డైలాగు తో కూడా ఆకట్టుకోలేకపోయారు. సంగీతం కోసం ఈ చిత్రానికి నలుగురు పని చేసారు కోటి, అచ్చు, రఘు కుంచె మరియు నేపధ్య సంగీతం చిన్న కనీసం ఒక్కరు కూడా ఆకట్టుకోలేకపోయరంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే కాని అదే నిజం ఒక్క పాత లేదా ఒక్క సన్నివేశానికి కూడా నేపధ్య సంగీతం ఆకట్టుకునేలా లేవు.. నిర్మాణ విలువలు కూడా చెప్పుకునే స్థాయిలో లేదు..

ఒక చిత్రాన్ని ఎలా తియ్యాలి అనడానికి ఉదాహరణగా కొన్ని చిత్రాలు ఉన్నట్టుగానే ఒక చిత్రాన్ని ఎలా తెరకెక్కించకూడదు అని చెప్పుకోడానికి కూడా ఒక ఉదాహరణ ఉంటే ఆ లిస్టు లో టాప్ 10 లో ఏదో ఒక స్థానంలో ఈ చిత్రం ఉంటుంది. చిత్రంలో అనాసక్తి తో పని చేసిన నటులను చూసి ఉండవచ్చు అనాసక్తి తో చేసిన సాంకేతిక వర్గాన్ని చూసి ఉండచ్చు కాని ఒక చిత్రాన్ని అనాసక్తిగా తెరకెక్కించడం చాలా తక్కుగా చూస్తుంటాం. తరువాత ఏ సన్నివేశం అయితే ఏంటి ఏదోటి అన్నట్టు వచ్చే సన్నివేశాల వరుస చూస్తుంటే కనీసం నిర్మాతకి అయిన ఈ చిత్రం ఎలా ఆసక్తి కలిగించింది అన్న అనుమానం కలుగుతుంది. మోహన్ బాబు మరియు అల్లరి నరేష్ మంచి చిత్రాలు చేసారు ఇలాంటి ఒక చిత్రంలో వారిని చూడాలని ఏ సినిమా అభిమాని కోరుకొడు.. ఒకవేళ తెలుగు చిత్రం దిగిన చివరి మెట్టు "సౌఖ్యం" అని మీరు అనుకుంటే ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాలి.... కచ్చితంగా చూడాలి!!!!

Mohan Babu,Allari Naresh,Varun Sandesh,Poorna,Ramya Krishna,Srinivass Redde,Manchu Vishnu,Achu,Koti,Raghu Kuncheమామ మంచు అల్లుడు కంచు - సినిమాకి తక్కువ....సీరియల్ కి కూడా తక్కువే ...

మరింత సమాచారం తెలుసుకోండి: