రాజ్ తరుణ్ , అర్తనల పెయిర్ , విశ్వ సినిమాటోగ్రఫీ , గోపి సుందర్ మ్యూజిక్ రాజ్ తరుణ్ , అర్తనల పెయిర్ , విశ్వ సినిమాటోగ్రఫీ , గోపి సుందర్ మ్యూజిక్ పాత చింతకాయ పచ్చడి లాంటి స్టొరీ లైన్ , ఊహాజనిత నేరేషన్ , బోరింగ్ సెకండాఫ్ , సాగదీసిన క్లైమాక్స్ , ఎడిటింగ్ , సపోర్టింగ్ రోల్స్ సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం

హీరో  పెడింది కుర్రోడు.. హీరోయిన్ గొప్పింటి అమ్మాయి.  ఇద్దరు ప్రేమించుకుంటారు.  దానికి పెద్దలు ఒప్పుకోరు.  వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఇది ఎప్పటినుంచో వస్తున్న కథే.  ఈ మూలంలోనుంచే మార్పులు చేర్పులు చేసుకొని.. సినిమా కథగా మర్చి సినిమాగా తీస్తున్నారు.  అలా వచ్చిందే సీతమ్మ అందాలు.. రామయ సిత్రాలు.  ఇందులో కూడా హీరో రామ్ అల్లరి చిల్లరిగా తిరగే వ్యక్తే.  చదువు పెద్దగా లేదు.  భవిష్యత్తు గురించి ఆలోచించని వ్యక్తి.  అనటువంటి హీరో గొప్పింటి అమ్మాయి సీత ను ప్రేమిస్తాడు.  సీత కోసం తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ కూడా పక్కన పెడతాడు రామ్.  అయితే, సీత మాత్రం అతడిని ప్రేమించడు.  ఇకపోతే, పెద్ద చదువులు కోసం సీత రామచంద్రాపురం నుంచి హైదరాబాద్ వెళ్తుంది.  సెలవులకు వచ్చినపుడు రామ్ సీతను లైన్లో పెట్టాలని ప్రయత్నం చేస్తుంటాడు.  ఓ సారి అతని ప్రయత్నం ఫలిస్తుంది. అయితే, ఈ విషయం సీత తండ్రికి తెలుస్తుంది.  పనిపాట లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే వాడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు తండ్రి ఒప్పుకోడు.  వెంటనే రంగంలోకి కాబోయే అల్లుడిని రంగంలోకి దించుతాడు.  అల్లుడు రంజీ క్రికెటర్.  సంపాదన కూడా బాగానే ఉన్నది.  మంచిపేరు కూడా తెచ్చుకున్నాడు.  ఇకపోతే, హీరో రామ్ కు, వరుణ్ కు మధ్య పోటీ ఏర్పడుతుంది.  ఆ పోటీ ఏమిటి.. పోటీలోఎలా నెగ్గాడు అన్నది చిత్ర కథ 

తన లైఫ్ లో ఉంది ఒక్కటే అమ్మాయి, ఎప్పటికైనా తననే పెమించి పెళ్లి చేసుకోవాలి అనే పాత్రలో రాజ్ తరుణ్ పెర్ఫార్మన్స్ బాగుంది. విలేజ్ కుర్రాడి లుక్ లో మరియు పల్లెటూరి మాస్ డైలాగ్స్ ని పర్ఫెక్ట్ గా చెప్పడంలో రాజ్ తరుణ్ సక్సెస్ అయ్యాడు. ఇక హీరోయిన్ అర్తన ఈ సినిమాకి మెయిన్ సోల్. తన క్యూట్ లుక్స్ మరియు అద్భుతమైన హావ భావాలతో అమితంగా ఆకట్టుకుంది. తనే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. తనకి మంచి అవకాశాలు వస్తే టాలీవుడ్ లో మంచి ప్లేస్ కి వెళ్తుంది. రాజ రవీంద్ర, హేమ, సురేఖ వాని, ఆదర్శ బాలకృష్ణ, శకలక శంకర్ మిగిలిన నటీనటులు తమ పరిదిమేర నటించారు. 

పాత కథకి కొత్త రంగులు అద్ది ఇప్పటి వారికి సరిపోయేలా చేసిన ప్రయత్నమే 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు'. నేటి యువతకి సెట్ అయ్యే అంశాలను, ప్రేమ కథని రాసుకొని చేసాడు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే.. తను ప్రేమించిన మామ్యి గెలుచుకోవడం కోసం ఒక పందెం కట్టి ఆ అమ్మాయిని గెలుచుకోవడమే సినిమా కథ.. ఈ సినిమా తెలుగులో వచ్చిన పందెం, లగాన్, కబడ్డీ కబడ్డీ మొదలైన సినిమాలను పోలి ఉంటుంది. డైరెక్టర్ మొదటి నుంచి పాత ఫార్మాట్ కథని తీసుకొని దానికి, తన దగ్గర ఉన్న రాజ్ తరుణ్ అనే హీరోని ఎలా వాడుకోవాలి అనుకుంటూ దానికి తగ్గట్టు పర్ఫెక్ట్ గా కథని సింగ్ చేసుకుంటూ సేఫ్ గేమ్ ఆడాలని ట్రై చేసాడు. దాని ప్రకారమే మొదలు పెట్టాడు.. కానీ రాను రాను అది కాస్తా పక్కకి వెళ్లి దారి తప్పి ప్రేక్షకులను నిరాశ పరిచే స్థాయికి వెళ్ళింది. ఈ సినిమాలో ప్రేమకి, రొమాన్స్, కామెడీ మరియు ప్రేమకోసం పోరాడే ఆటకి మంచి స్కోప్ ఉంది. కానీ ఇవేవి  ప్రేక్షకులకి పెర్ఫెక్ట్ గా టచ్ అయ్యేలా చేయలేకపోయాయి. దాంతో కథ పాతదే అయినా కొత్త సీన్స్ తో కూడా ఇంప్రెస్ చేయలేకపోయాడు. 

ఇక మిగిలిన వారి విషయానికి వస్తే.. గోపి సుందర్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. సాంగ్స్ ఎంత బాగున్నాయో అంతకన్నా పిక్చరైజేషన్ బాగున్నాయి. అలాగే నేపధ్య సంగీతం కూడా సీన్స్ కి ప్రాణం పోసాడు. ఇక విశ్వ సినిమాటోగ్రఫీ సూపర్బ్. ఎంచుకున్న లొకేషన్లే మస్త్ గా ఉంటే, ఆ లొకేషన్స్ ని చూపిన విధానం ఇంకా బాగుంది. ఎడిటర్ హరీష్ ఇంకాస్త కేర్ తీసుకొని సినిమాని కత్తిరించి ఉంటే బాగుండేది. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓ పాత కథకి కొత్త రంగులు అద్ది డీసెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తీయాలని చేసిన ప్రయత్నమే 'సీతమ్మ్ అందాలు రామయ్య సిత్రాలు'. అందులో భాగంగానే ఫస్ట్ హాఫ్ లో కొన్ని లవ్ మోమెంట్స్, కామెడీ బిట్స్ తో అలా అలా సాగిపోయినా హారిబుల్ సెకండాఫ్ తో ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేసాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ని అయితే సాగదీసి వదిలాడు. నూతన పరిచయం అయిన హీరోయిన్ అర్తన పెర్ఫార్మన్స్, గోపి సుందర్ మ్యూజిక్, విజుబల్స్ ఆడియన్స్ కి కాస్త అనడాన్ని ఇస్తాయి. ఈ సినిమా లో మీరు ఇది వరకూ తెరపై చూడనిది అయితే ఏమీ చూడరు. అంతా చూసిందే, కానీ ఏదో కొన్ని కామెడీ బిట్స్ కోసం తప్ప పెద్దగా ఇంప్రెస్ చేసే సీన్స్ ఏమీ ఇందులో లేవు. థియేటర్ కి వెళ్లి చూడాల్సిన కంటెంట్ ఉన్న సినిమా అయితే ఇది కాదు. 

Raj Tarun,Arthana,Srinivas Gaavi Reddy,S Sylendra Babu,Gopi Sunderసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు - గురి తప్పినా సేఫ్ గేమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: