వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. ఈ యువ హీరో శర్వానంద్ నటించిన కొత్త సినిమా కో అంటే కోటి. ఈ సినిమాలో ప్రియానంద్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను శర్వానంద్ నిర్మించడం విశేషం. ఈ సినిమాకు అవకాయ్ బిర్యానిదర్శకుడు అనిష్ కురువిల్లా దర్శకత్వం వహించడంతో కొంత మంది ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. మరి సినిమా ఎలా వుందో చూద్దాం..! చిత్రకథ : అనాథ అయిన వంశీ [శర్వానంద్] బతకడం కోసం దొంగతనాలు చేస్తుంటాడు. మాయా మాస్టర్ [శ్రీహారి] దొంగతనాలే వృత్తిగా జీవిస్తుంటాడు. చివరగా ఓ పెద్ద దొంగతనం చేసి జీవితంలో స్థిరపడాలని మాయా మాస్టర్ భావిస్తాడు. అందుకోసం ఎతైన భవనాలు ఎక్కడంలో సిద్ధహస్తుడైన వంశీని తన గ్యాంగ్ లో చేర్చుకుంటాడు. అయిష్టంగానే మాయా మాస్టర్ తో వంశీ చేతులు కలపుతాడు. నల్లధనం దాచిన డైమండ్ హౌస్ నుంచి డబ్బును దొంగలిస్తారు. అయితే తను ప్రేమించిన సత్య [ప్రియానంద్] కోసం ఆ డబ్బును వంశీ తిరిగి ఇవ్వాల్సివస్తుంది. మరి ఇందుకు మాయా మాస్టర్ ఒప్పుకున్నాడా..., దొంగతనాలు చేసి బ్రతికే వంశీ ఎలాంటి సందర్భంలో సత్యను ప్రేమిస్తాడు, సత్యకు మాయా మాస్టర్ కు బంధం ఏమిటి అనేది వెండితెర మీద తెలుసుకోవాలి. నటీనటుల ప్రతిభ : డబ్బు కోసం అనుబంధాలను కూడా కాదనుకునే దొంగగా శ్రీహరి నటించాడు. ఇలాంటి పాత్రలను శ్రీహరి చాలా సినిమాల్లో చేశాడు. గత సినిమాలతో పోల్చుకుంటే శ్రీహరి నటన ఈ సినిమాలో సాధారణంగా ఉంది. దొంగగాను, మంచిగా మారాలనుకునే పాత్రలోనూ శర్వానంద్ చక్కగా నటించాడు. ప్రియానంద్ తో లవ్ సీన్లలోను శర్వానంద్ నటన బావుంది. చలాకీ పాత్రలో ప్రియానంద్ నటన కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ అనిపించింది. శర్వానంద్ తో లిప్ లాక్ సీన్లలోనూ ప్రియానంద్ నటించడం ఈ సినిమాలో ఓ విశేషం. బండబాబుగా నటించిన నటుడు ప్రేక్షకులకు గుర్తుంటాడు. మిగిలినవారు తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : ఈ సినిమాకు ఫోటోగ్రఫీ మైనస్ పాయింట్, ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను చూస్తుంటే పాత తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. లైటింగ్ అసలు కుదరలేదు. సంగీతం కూడా అంతే, పాటలు అన్నీ స్లోగా సాగుతాయి. గుర్తుపెట్టుకునే మాటలు ఈ సినిమాలో ఉండవు. ఒక భారీ దొంగతనం నేపథ్యంలో ఒక దొంగకు చెందిన ప్రేమకథను చూపడానికి దర్శకుడు విఫలయత్నం చేశాడు, ప్రేమకథను, దొంగతనాన్ని ముక్కలు-ముక్కలుగా చూపిస్తూ సినిమాను నడిపించడంతో కథతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. నిర్మాణ విలువలు సాధారణంగా ఉన్నాయి. విశ్లేషణ : నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఈ సినిమాను స్వయంగా నిర్మించడంతో కో అంటే కోటి లో ఏదో ఉంది అని ఆశించి వెళ్తే ఈ సినిమా నిరాశను కలిగిస్తుంది. మంచి కథ గానీ, గుర్తుపెట్టుకునే పాత్ర గానీ ఈ సినిమాలో ఉండవు. దొంగతనాలు నేపథ్యం, ఒక దొంగ మంచి వ్యక్తిగా మారాలనుకునే పాతకథతో ఈ సినిమాను రూపొందించారు. కనీసం స్క్రీన్ ప్లే పై కసరత్తు చేసినా మంచి ఫలితం వచ్చిఉండేది. అకట్టుకునే స్క్రీన్ ప్లే లేకపోవడం, హీరో ప్రేమకథను ఫ్లాష్ బ్యాక్ లో చెప్పడం, పైగా కొంచెం, కొంచెం చెప్పడం ఈ సినిమాకు ప్రధాన లోపం. ఈ రివ్యూలో చిత్రకథ విభాగంలో చెప్పుకున్నట్లుగా సినిమా కథ సాగదు. ప్రేక్షకులను కన్ ఫ్యూజ్ చేసే విధంగా సినిమా సాగుతుంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ, వినోదం.. ఇలా ఏ వర్గానికి చెందని ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నిలబడ్డం కష్టమైన విషయం. బయట బ్యానర్లలో మంచి దర్శకులతో సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపుతో కెరీర్ సాగిస్తున్న శర్వానంద్ నిర్మాతగా చేతులు కాల్చుకున్నాడని చెప్పుకోవాలి. చివరగా : కో అంటే కోటిసినిమాతో శర్వానంద్ కు చేదు అనుభవం.

మరింత సమాచారం తెలుసుకోండి: