ప్రీ క్లైమాక్స్ , ఇంటర్వెల్ బాంగ్ , స్టొరీ లైన్ ప్రీ క్లైమాక్స్ , ఇంటర్వెల్ బాంగ్ , స్టొరీ లైన్ గోపి మోహన్ రచన , అస్సలు ప్రయోజనం లేని కథనం , డెడ్ స్లో నేరేషన్ , వీక్ డైరెక్షన్ , నో ఎంటర్టైన్మెంట్ , నో ఎమోషన్స్ , డిజాస్టర్ ఫస్ట్ హాఫ్

'జరిగిన ప్రతి సంఘటన వెనుక మూడు కథలుంటాయి.. ఒకటి జనాలు ఊహించేది, రెండు చేసినవాడు చెప్పేది, మూడు వాస్తవంగా జరిగేది' 

ఈ పాయింట్ బేస్ చేసుకునే ఈ సినిమా కథ మొత్తం తిరుగుతుంది. ఇక కథలోకి వెళితే.. ఉన్న దానిలో హ్యాపీగా బతికే ఫ్యామిలీకి చెందిన శౌర్య(మంచు మనోజ్) నేత్ర(రెజీన)ని చూసి ప్రేమలో పడతాడు. యధావిధిగా కొద్ది రోజులకి ఇద్దరూ ప్రేమలో పడతారు. కట్ చేస్తే నేత్ర ఫామిలీ నుంచి చిన్న సమస్య. దాంతో వాళ్ళు దేశం వదిలి పారిపోవాలని అనుకుంటారు. కట్ చేస్తే వారు వెళ్ళాలి అనుకున్న ముందు రోజు శౌర్య - నేత్ర గుడిలో జాగారం చేస్తారు. ఉదయం లేచే సరికి నేత్ర పీక కోసేసి ఉంటారు. చావు బతుకుల్లో ఉన్న నేత్రని హాస్పిటల్ లో చేర్చి, శౌర్యనే చంపాడు అని అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే కోర్టులో శౌర్య నేనే చంపాను అని ఒప్పుకుంటాడు. అందరికీ షాక్.. ఇక అక్కడి నుంచి శౌర్య ఎందుకు నేత్రని చంపాలనుకున్నాడు? నిజంగా శౌర్యనే చంపాడా లేక డ్రామా ప్లే చేసాడా? ఫైనల్ గా ఈ కేసుని కృష్ణ ప్రసాద్(ప్రకాష్ రాజ్) ఎలా సాల్వ్ చేసాడు? అన్నదే మిమ్మల్ని థ్రిల్ చేసే కథ. 


మంచు మనోజ్ ఏ పరంగా లావు అయ్యాడో తెలియదు గానీ బయటకి మాత్రం సినిమా కోసం లావు అయ్యానని చెప్పాడు. కానీ సినిమాకి, అతని పాత్రకి మనోజ్ అలా ఉండడం అస్సలు సూట్ కాలేదు. మెయిన్ గా తన లుక్ కొంతవరకూ ఎబ్బెట్టుగా ఉంది. ఇక నటనపరంగా చూసుకుంటే పెద్ద గొప్పగా ఏమీ చేయలేదు కానీ పాత్రకి సరిపోయేలా చేసాడు. మామూలుగా ఎనర్జిటిక్ పాత్రలు చేసే మనోజ్ ఈ సినిమాలో సైలెంట్ టైపు పాత్ర చేసాడు. అందుకే చూసే వారికి మనోజ్ చాలా కొత్తగా ఉంటాడు. ఇక రెజీన ఈ సినిమాలో పక్కా హోమ్లీ గర్ల్. గ్లామర్ అనేది లేకుండా కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించి నటన పరంగా మెప్పించింది. ఇకపోతే ఈ సినిమాకి చాలా కీలకం అయిన పాత్రలో ప్రకాష్ రాజ్ తన నటనతో సినిమాకి మంచి ఊతం ఇచ్చాడు. ఇక మిగిలిన నాగినీడు, సుబ్బరాజు, నందు, శ్రవణ్, సత్య ప్రకాష్ లు పరవాలేదనిపించారు. ప్రభాస్ శీను ఓ రెండు సీన్స్ లో నవ్వించగా, బ్రహ్మానందం మరో సారి నవ్వించడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.   

ఇప్పటి వరకూ ఒకే తరహాలో సినిమాలు చేస్తూ వచ్చిన దశరథ్ 'శౌర్య' సినిమా కోసం కొత్త దానం యాడ్ చేయాలని అనుకోని ప్రేమకథకి థ్రిల్లర్ ని జత చేసాడు.. ఈ సినిమాలో తీసుకున్న మెయిన్ ప్లాట్ మరియు థ్రిల్లింగ్ ఎపిసోడ్ గతంలో వచ్చిన 'గౌరవం' సినిమాలానే ఉంటుంది. ఇక్కడ డీల్ చేసింది వేరైనా కాన్సెప్ట్ మాత్రం ఒకటే.. కాబట్టి సినిమా ఎలా ఉంది ఉంటుందో మీకిప్పటికే అర్థమా అయ్యుంటుంది. దశరథ్ ఎంచుకున్న లైన్ బాగున్నా దానిని కథగా మలుచుకునేతప్పుడు చాలా బోరింగ్ గా రాసుకున్నాడు. దానిని రచించిన గోపి మోహన్ ఇంకా డల్ అయ్యేలా పర్ఫెక్ట్ కథని ఇచ్చాడు.. వీరిద్దరూ కలిసే కథని చాలా బోరింగ్ చెసరు.. దాంతో స్క్రీన్ ప్లే రాసిన కిషోర్ గోపు ఏమీ చేయలేక చేతులెత్తేసాడు. తన దగ్గర ఉన్న మెయిన్ ట్విస్ట్ లని సినిమా చివర్లో కాస్తన్నా సేవ్ చేద్దాం అని చివర్లో వేసి సినిమాని మరింత బోర్ కొట్టించేసారు. కథ - కథనం - నేరేషన్ ఏదీ సినిమాని సేవ చేయలేకపోయింది. వీటన్నిటికీ తోడు దశరథ్ కెరీర్లోనే వీక్ డైరెక్షన్ ఈ సినిమాకే ఇచ్చాడని చెప్పాలి. ఎందుకంటే.. దశరథ్ ఫ్లాప్ సినిమాలు ఇచ్చాడు కానీ ఎమోషన్స్ ని బాగా చూపించేవాడు. కానీ ఇందులో లవ్, ఫ్యామిలీ, సెంటిమెంట్ ఇలా దేనినీ సరిగా చూపించలేదు. ట్విస్ట్ ల వల్ల కొన్ని సీన్స్ బాగుంటాయి కానీ అస్సలు ఎంగేజింగ్ గా ఏ సీన్ తీయకపోవడం గమనార్హం. ఓవరాల్ గా దశరథ్ స్క్రిప్ట్ దశ నుంచి అవుట్ పుట్ వరకూ అన్ని చోట్లా ఫెయిల్ అయ్యాడు అనే చెప్పాలి. 


మల్హర్ భట్ జోషి అందించిన సినిమాటోగ్రఫీ ఓకే ఓకే అనేలా ఉంది. ఎక్కడా అబ్బా భలే ఉన్నాయి విజువల్స్ అనేలా లేవు, అలా అని అస్సలు బాలేవు అనేలా కూడా లేవు. ఇక వేద సాంగ్స్ ఒకటి రెండు పర్లేదు, కానీ మిగతా ఏవీ ఎక్కవు. ఇక నేపధ్య సంగీతం కూడా పెద్ద గొప్పగా ఏమీ లేదు. జస్ట్ ఓకే ఓకే. ఎస్ఆర్ శేఖర్ ఎడింగ్ ఏ మాత్రం బాగుందని చెప్పలేం. ఎందుకంటే 2 గంటల సినిమాని తన ఎడిటింగ్ తో 20 గంటల సినిమా అని ఫీల్ అయ్యేలా చేసాడు. హరి - కిషోర్ గోపి డైలాగ్స్ కోడా అంత బాగా లేవు. మల్కాపురం శివకుమార్ ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ అనిపించాయి. 


ఈ మధ్య ప్రతి ఒక్కరూ కొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తున్నారు, నేనూ ఏదో ఒకటి ట్రై చేయాలని దశరథ్ తనకు తెలిసన ప్రేమ  కథకి థ్రిల్స్ యాడ్ చేసాడు.. ఈ ప్రాసెస్ లో థ్రిల్స్ మీద దృష్టి పెట్టి తనకి తెలిసిన లవ్ అండ్ ఎమోషన్స్ ని మిస్ చేసాడు. దాంతో థ్రిల్ చేయాల్సిన శౌర్య థ్రిల్ చేయలేక చతికిల పడింది.. కేవలం ప్రీ క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రమే వీరి మెయిన్ స్టొరీ లైన్ దానిని బాగానే డీల్ చేసారు కానీ మిగతా అంతా గాలికి వదిలేయడంతో సినిమా ఫ్లాప్స్ లిస్టులో చేరిపోయింది. కొత్తగా ఏదో చేయాలను కొని ట్రై చేసిన దశరథ్ కొత్తగా చేసిన దాంతో సంతృప్తి పరచలేకపోయాడు, ఆ కన్ఫ్యూజన్ లో తనకు తెలిసిన దాన్ని కూడా డీల్ చేయలేక ఫెయిల్ అయ్యాడు. ఓవరాల్ గా దశరథ్ ఫెయిల్యూర్ శౌర్య సినిమాని ఈ ఏడాది ఫ్లాప్స్ లిస్టు లో చేర్చింది. ఎంటర్ టైన్మెంట్ కావాలని అని కోరుకునే వారికి ఈ సినిమా కరెక్ట్ కాదు, అలాగే థ్రిల్లర్స్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు చూస్తే థ్రిల్ అవ్వకపోగా, ఈ మాత్రానికే థ్రిల్లర్ అని ప్రమోట్ చేసుకున్నారా అని పెదవి విరుస్తారు. కావున శౌర్య ఈ వీక్ వచ్చిన వాటిల్లో మెప్పించలేని సినిమాగా మిగిలిపోయింది.

Manchu Manoj,Regina Cassandhra,Dasaradh,Malkapuram Shiva Kumar,Vedaశౌర్య - ఫెయిల్యూర్ థ్రిల్లింగ్ లవ్ స్టొరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: