ఆనంద్ విహారి (నితిన్) అలియాస్ నందు కల్వపూడిలో నివసిస్తూ తన కుంటుబంతో ఉంటుంటాడు. అనసూయ రామలింగం (సమంత) మహా లక్ష్మి (నదియా) రామలింగం (నరేష్) ల ఏకైక పుత్రిక. అనసూయ మంచి కోసం ఎప్పుడు తన కంట్రోల్ లో ఉంచే ప్రయత్నంలో తనకు నచ్చని విధంగా ప్రవర్తిస్తుంది మహాలక్ష్మి. అయితే ఈ క్రమంలోనే తనకు ఏం పని రాదని తేల్చుకుని పెళ్లి చేద్దామని ఫిక్స్ అవుతుంది. ఇక ఆ క్రమంలోనే ఓ పెళ్లిఫిక్స్ చేస్తే దాన్ని కాస్త రామలింగం సహాయంతో తప్పించుకుని ఓ పది రోజులు నందు వాళ్లింట్లో ట్రిప్ వేస్తుంది. ఇక ఆ జర్నీలో నందుని అనసూయ ఇష్టపడుతుంది. ఇక ఓ పక్క పల్లెం వెంకటేష్ (రవు రమేష్) తన కూతురు నాగవల్లి (అనుపమ పరమేశ్వరన్) నందుని ఇష్టపడ్డదని అతనితో నిశ్చితార్ధానికి రెడీ అవుతాడు. మరి అసలు మహాలక్ష్మి ఎందుకు నందు ఫ్యామిలీని దూరం చేసుకుంది..? రామలింగం ఎందుకు నోరు మెదపలేదు..? చివరకు నందు, అనసూయల లవ్ స్టోరీ ఏమైంది అన్నది అసలు కథ.
త్రివిక్రమ్ సినిమాలో పాత్రలన్ని చాలా సహజంగా నడుస్తాయి. తన మార్క్ డైలాగులతో ఆకట్టుకునే ప్రయత్నం చేసే త్రివిక్రమ్ నితిన్ ను చాలా సింపుల్ గా చూపించాడు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నితిన్ సినిమాలో చాలా కూల్ అండ్ ప్లెజెంట్ లుక్ తో కనబడ్డాడు. ఇక డైలాగుల్లోని ఫీల్ ను నితిన్ పలికిన విధానం సూపర్. అఆ సినిమాకు ముఖ్య పాత్ర అంటే అనసూయ అదే మన సమంత.. సినిమా ఆమె మనోగతంతో స్టార్ట్ అవుతుంది. సో సినిమా మొత్తం చెప్పాలంటే సమంతదే అన్నమాట.
అనసూయగా బబ్లీగా.. క్యూట్ గా.. అందం అభినయంతో మరోసారి తనకు తాను కేక అనిపించుకుంది సమంత. ఇక మహాలక్ష్మిగా నదియా తన మార్క్ నటనతో ఆకట్టుకోగా.. నరేష్ కూడా పాత్ర పరిధి మేరకు పర్వాలెదనిపిచుకున్నాడు. ఇక పల్లెం వెంకటేష్ గా రావు రమేష్ తన మార్క్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. సినిమాలో నాగవల్లిగా అనుపమా హాఫ్ సారీస్ లో అదరగొట్టింది. మొదటి సినిమా అయినా సరే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని పాత్రకు అందం వచ్చేలా చేసింది. మిగతా పాత్రల్లో ప్రవీణ్, అజయ్, పోసానిలు పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
అఆ సినిమాను కలర్ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు 24 విభాగాల్లో పనిచేసిన వారు తమ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. తన పెన్ పవర్ తో మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసిన త్రివిక్రమ్ పర్వాలేదనిపించుకోగా సినిమాకు మ్యూజిక్ అందించిన మిక్కి జే మేయర్ సినిమాకు ప్రాణంగా నిలిచాడు. ఇక కెమెరా మన్ నటరాజన్ సుబ్రమనియన్ పనితనం బాగుంది. తెర మీద పల్లెటూరి అందాలను చూపించిన విధానం బాగుంటుంది. ఇక ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వర రావు వర్క్ అవుట్ పుట్ బాగానే ఉన్నా సినిమా ఇంకాస్త ట్రిం చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక సినిమా నిర్మాత కె.రాధాకృష్ణ అలియాస్ చినబాబు సినిమా ప్రతి ఫ్రేంలో రిచ్ గా కనిపించేలా చేసి ప్రొడక్షన్ వాల్యూస్ లో పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు.