Kadali:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review


4:15pm: APHerald ‘కడలి’ తెలుగు ట్వీట్ రివ్వూ viewers కు స్వాగతం
4:15pm: అరవిందస్వామి, అర్జున్ టీనేజ్ లో ఉన్నప్పటి సన్నివేశంతో చిత్రం ప్రారంభమైంది.  
4:20pm: అరవిందస్వామి 12 సంవత్సరాల తర్వాత తెరపై చూడడం ఆనందంగా ఉంది. ఇంతకుముందు చిత్రాల్లోకంటే ఇప్పుడు చూడటానికి బాగున్నాడు.      
4:25pm: అర్జున్ సినిమాలో తనదైన శైలితో ప్రేక్షకులను నవ్వులుపువ్వులను విరబూయిస్తున్నాడు. అరవింద్- అర్జున్ చిన్న చిన్న అల్లరి చిల్లరి గొడవలు చేస్తూ ప్రేక్షకులను అలరింపచేస్తున్నారు.
4:30pm:  థామస్ [గౌతమ్] తన తల్లిని కొల్పోయిన అనాథ. ఈ సన్నివేశంలో ‘చిట్టి జాబిల్లి’ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో వస్తుంది.
4:35pm:  ‘మగది మగది’ అనే సాంగ్ కొనసాగుతూ సినిమా టైటిల్స్ వస్తూ థామస్ చిన్నపిల్లాడి నుండి పెద్దవాడిగా మారుతున్న స్టైల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
4:39pm: అరవిందస్వామి చర్చిఫాదర్ వేశధారణలో తనదైన శైలిలో ఆకర్షిస్తున్నాడు.
4:43pm: థామస్-షామ్ ల మధ్య సంభాషణలు ఫన్నీగా సాగుతున్నాయి.
4:50pm: థామస్ చిన్నపిల్లోడి నుండి పెద్దగావుతున్సపుడు ‘ఎలేచెల్లే’  సాంగ్ లో గౌతమ్ ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి.  రహమాన్ అద్బుతమైన వాయిస్ తోపాటు సంగీతంతో  ప్రేక్షకుల మధిదోచుకుంటుంది. ఈ సాంగ్ లో సినిమాటోగ్రఫీ  సముద్రపు సన్నివేశాల్ని తనదైన శైలిలో ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నాడు.
5:00pm: తులసి సహజంగా పరిచయమవుతూ అందంగా కనిపిస్తుంది.
5:05pm: గౌతమ్ పలుకుతున్న సంబాషణలు తన వాయిస్ కి తన ఎక్స్ ప్రెషన్ కి పొంతనలేకుండావుంది. ప్రేక్షకులకు ఇది ఫన్నీగా ఉంటుంది. 
5:07pm: సినిమా టీవీ సిరియల్ లాగా నెమ్మదిగా సాగుతుంది.
5:15pm: మంచులక్ష్మీ[సెలినా]పరిచయం కూల్ గా వాయిస్ సహజంగా చూడ్డానికి బావుంది.
5:20pm: గౌతమ్- తులసి మరొకసారి కలిసిన సన్నివేశంలో వారిద్దరి ఎక్స్ ప్రెషన్స్ క్యూట్ గా కనిపిస్తున్నాయి.            
5:25pm: ‘యాడికె- యాడికె’ సాంగ్ ప్రారంభమైంది.థియోటర్లో ప్రేక్షకులలో పాటలోని లిరిక్స్ నవ్వులపువ్వులుపూయిస్తున్నాయి.    
5:30pm: సినిమా నెమ్మదిగా కొనసాగుతుంది. దీంతో ప్రేక్షకులు ఇంట్రవెల్ కు ముందే బయటకు వెళుతున్నారు.
5:35pm: గౌతమ్ తన మనసులోని కోరికలను బయటపెడుతాడు. ఈ సన్నివేశంలో గౌతమ్ ఎక్స్ ప్రెషన్స్ సహజంగా ఉన్నాయి.  
విశ్రాంతి
5:42pm: చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులను అలరించలేకుండా ఉంటున్నాయి. సినిమా ఫస్టాఫ్ లో ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యే విధంగా ఉంది.
5:50pm: గౌతమ్ నెమ్మదిగా బ్యాడ్ బోయ్ గా  సిటీలో చేంజ్ అవుతున్నాడు. అర్జున్ గౌతమ్ కు తెలియజేస్తుంటూనే బ్యాక్ గ్రౌండ్ లో మగది అనే సాంగ్ వస్తుంది. ఈ సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
5:58pm: సినిమాలోని సన్నివేశాలు ట్రిపికల్ గా మణిరత్నం కథలో మలుపులతో తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించగలిగాడు. బ్యాగ్రౌండ్ లో వస్తున్న ‘సింకింగ్’ సాంగ్ సన్నివేశాని తగినవిధంగా ఉంది.
6:07pm:  తులసి లవ్ ట్రాక్ తో ప్రేక్షకులకు కొంచెం ఉత్సాహం కనిపిస్తుంది.
6:13pm: ‘గుంజుకున్నా- నిన్ను ఎదలోకే’ సాంగ్ మొదలైంది. సాంగ్ ప్రేక్షకులలో మరింత ఉత్సాహం నింపుతోంది.
6:20pm: చిత్రంలోని ఈ సీన్ క్రిష్టియన్ బైబిల్ గురించి, క్రిష్టియనిజం గుర్తుచేసే విధంగా సాగుతుంది.
6:26pm: ‘పచ్చని తోట’ అనే సాంగ్ వస్తుంది. గౌతమ్- తులసి మద్య కెమిస్ట్రి ప్రేక్షకులను రంజింపచేస్తుంది. సాంగ్ లో ‘లిప్ లాక్’ సీన్ కి తగినవిధంగా లేదు.
6:30pm: ఈ సినిమా గొప్పతనం డైరెక్టర్ మణిరత్నానికే ఇవ్వాలి.  కథ చిన్న లవ్ స్టోరిని స్క్రిప్టును  తనదైన శైలిలో రూపుదిద్ది ప్రేక్షకులను ఆకర్షించే విధంగా చూపిస్తున్నాడు.           
6:35pm: అర్జున్ విలన్ గా తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. కథ క్లైమాక్స్ కు చేరువలో ఉంది. కథలో  తులసి- అర్జున్ ల మద్య జరిగే ట్విస్ట్ అలరిస్తుంది.
6:44pm: కథ క్లైమాక్స్ మధ్యలో వర్షం పడుతున్నప్పుడు సమద్రంపై చిత్రీకరించిన సన్నివేశం చూడముచ్చటగా ఉంది.
6:50pm: అర్జున్- అరవిందస్వామి మధ్య జరిగే సంబాషణలు క్లైమాక్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శుభంకార్డు పడుతుంది.             Raja can be reached at: Cherukuri.Rajanaidu@apherald.com
Editor can be reached at: editor@apherald.com

More Articles on Kadali || Kadali Wallpapers || Kadali Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: