దుల్కర్ సల్మాన్ , నిత్యా మీనన్ , సినిమాటోగ్రఫీ దుల్కర్ సల్మాన్ , నిత్యా మీనన్ , సినిమాటోగ్రఫీ రొటీన్ స్టోరీ, స్లో నేరేషన్, డైరక్షన్

రావు గోపాల్ రావు అలియాస్ గోపాల్ (దుల్కర్ సల్మాన్) ఓ ది టైమ్స్ లో ఫీచర్ రైటర్ గా పనిచేస్తుంటాడు. లవ్ ఫెయిల్ అయిన గోపాల్ తన 100 డేస్ ఆఫ్ లవ్ జర్నీని చెబుతాడు. ఓరోజు సడెన్ గా క్యాబ్ లో చూసిన సావిత్రి (నిత్యా మీనన్) తన కెమెరా పోగొట్టుకుంటుంది. అయితే అది కనిపెట్టిన గోపాల్ అది ఆమెకు ఇచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు కాని సావిత్రి ఎక్కడ కనబడదు. ఇక ఆ క్రమంలో తన స్నేహితుడు రూమ్మెట్ గుమ్మడి (శేఖర్ మీనన్) సహాయంతో గేమ్ ప్లానింగ్ తో ఆమెను వెతకడం మొదలు పెడతారు. తను పోగొట్టిన కెమెరాలోని రీల్ ను కడిగించి చూస్తే ఓ ఐదు ఫోటోలు అవి వేరు వేరు ప్లేసుల్లో దిగినట్టు ఉంటుంది. ఇక ఆ క్లూస్ తో ఆమెను కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక ఈ టైంలో సావిత్రిని పెళ్లాడబోయే రాహుల్ గోపాల్ కు వార్నింగ్ ఇస్తాడు. ఫైనల్ గా సావిత్రిని కనిపెట్టిన గోపాల్ తను చిన్ననాటి ఫ్రెండే అని గుర్తిస్తాడు. ఇంతకీ సావిత్రిని గోపాల్ ప్రేమించాడా..? రాకేష్ తో చాలేంజ్ చేసిన గోపాల్ సావిత్రిని ఎలా గెలుచుకున్నాడు..? అన్నది అసలు కథ.    

మలయాళ సినిమా అయినా తెలుగు వారికి బాగా ఇష్టమైన విలన్ గా పేరు పొందిన రావు గోపాల్ రావు పేరుతో దుల్కర్ సల్మాన్ మంచి నటన కనబరించాడు. ఇక సావిత్రిగా నిత్యా మీనన్ ఎప్పటిలానే అదరగొట్టేసింది. ఓకే బంగారం సినిమాతో తెలుగులో కూడా క్రేజీ జంటగా మారిన దుల్కర్, నిత్యాలు ఈ సినిమాతో కూడా ఆకట్టుకున్నారు. ఇక గుమ్మడిగా నటించిన శేఖర్ మీనన్ కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. వినీత్ హుందాతనమైన పాత్రలో మెప్పించాడు. సినిమా స్టార్ట్ కాస్ట్ కూడా చాలా తక్కువ కాబట్టి ఉన్నంతలో వారు బాగానే మెప్పించారు. 

100 డేస్ ఆఫ్ లవ్ సినిమ టెక్నికల్ టీం విషయానికొస్తే ముందు దర్శకుడు జీనస్ మహమ్మద్ గురించి చెప్పాలి. సినిమా కథ కొత్తదేమి కాకపోయినా దాన్ని తెరకెక్కించడంలో నేరేషన్ స్లోగా సాగిందని చెప్పాలి. గోవింద్ మీనన్ అందించిన సాంగ్స్ పర్వాలేదు కేవలం సినిమాలో తప్ప బయటకు వస్తే గుర్తుండిపోయేలా ఉండవు. ప్రతీష్ వర్మ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ సందీప్ కుమార్ ఇంకాస్త కత్తెరలు వేస్తే బాగుండేది. కె.వి.విజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో వెంకటరత్నం రిలీజ్ చేశారు. ఇక అభిషేక్ పిక్చర్స్ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 



ఓ రొమాంటిక్ కామెడీగా వచ్చిన 100 డేస్ ఆఫ్ లవ్ దుల్కర్, నిత్యాల కాంబినేషన్లో వచ్చిన ఓకే బంగారం మ్యాజిక్ రిపీట్ చేస్తుంది అనుకున్నారు. అయితే 100 డేస్ లవ్ సినిమాల్లాంటివి తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. ఇక దర్శకుడు జీనస్ మహమ్మద్ సినిమాను చాలా స్టైలిష్ గా తీశారు కాని తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి స్లో నేరేషన్ సినిమాలు ఏంటో గ్రిప్పింగ్ తో తీస్తే గాని ఎక్కవని గుర్తించలేదు. మణిరత్నం మార్క్ టేకింగ్ తో వచ్చిన 100 డేస్ ఆఫ్ లవ్ ఆ మ్యాజిక్ వర్క్ అవుట్ అయ్యేలా చేయలేదు. 


హీరోయిన్ కెమెరా దొరకడం ఆమె కోసం హీరో వెతకడం ఇవన్ని సీన్స్ టైం పాస్ అనిపించినా ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసే కథనాలుగా అనిపించవు. సడెన్ గా హీరోయిన్ ను కలిస్తే అది కాస్త తన చిన్ననాటి ఫ్రెండ్ అని ఆమె మీద కోపం పెంచుకోవడం అంతా గజిబిజిగా ఉంటుంది. ఇక ఓ చిన్న సీన్ లో డ్యుయల్ రోల్ లో కనిపించిన దుల్కర్ అసలు ఎందుకు ఆ పాత్రను ఇన్వాల్వ్ చేశాడో దర్శకుడికే తెలియాలి.   


100 డేస్ ఆఫ్ లవ్ అంటూ వచ్చిన ఓకే బంగారం జంట ఈసారి మాత్రం ఆడియెన్స్ సహనానికి పరిక్ష పెడుతుంది. సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదు, గ్రిప్పింగ్ సబ్జెక్ట్ లేదు ఏదో సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఇక సినిమాలో చెప్పుకోదగ్గవి అంటే చివరి హాఫ్ ఆన్ అవర్ నడిపించిన విధానం ఓకే అనిపిస్తుంది. కాని ఈ క్లైమాక్స్ కోసం సినిమా అంతా భరించాలా అన్న ఫీలింగ్ కలుగుతుంది. 


అన్ని సినిమాల్లా కాదు కాదు అంటూనే మళ్లీ రొటీన్ గానే కానిచ్చేశాడు డైరక్టర్. ఇక తెలుగులో క్యాచిగా ఉండేందుకు రావు గోపాల్ రావు, సావిత్రి అంటూ మెయిన్ కాస్ట్ పేర్లు పెట్టడం అంతేకాదు కమెడియన్ పేరు కూడా గుమ్మడి అని పేరు పెట్టడం వల్ల ఉపయోగం ఏమి లేకుండా పోయింది. కేవలం మల్టీప్లెక్స్ ఆడియెన్స్ అది మరి బోర్ కొడితే చూసే సినిమా ఇది. ఇక బి,సి సెంటర్స్ లో బాబోయ్ ఇదేం సినిమా అనేయడం ఖాయం.    




Dulquer Salmaan,Nithya Menen,Jenuse Mohamed,K. V. Vijayakumar,Govind Menon'100 రోజుల ప్రేమ' ప్రేక్షకుల సహనానికి పరిక్షే..!

మరింత సమాచారం తెలుసుకోండి: