కళ్యాణ్ రాం నటన , సినిమాటోగ్రఫీస్ , క్లైమాక్స్ కోర్ట్ సీన్కళ్యాణ్ రాం నటన , సినిమాటోగ్రఫీస్ , క్లైమాక్స్ కోర్ట్ సీన్స్క్రీన్ ప్లే , హీరోయిన్

సత్య మార్తాండ్ (కళ్యాణ్ రాం) ఓ జర్నలిస్ట్.. తన తండ్రి నిజాలను బయట పెడుతున్న కారణం చేత అతన్ని అవిటి వాడిని చేయడంతో అలాంటి వారిని టార్గెట్ చేస్తాడు సత్య. అంతేకాదు ఈ క్రమంలోనే మాఫియా డాన్ జావేద్ భాయ్ (జగపతి బాబు) ని టార్గెట్ చేసి అతని కూతురు అలియా ఖాన్ (అదితి ఆర్య) ను లైన్లో పెడతాడు. జావేద్ ను టార్గెట్ చేసిన సత్య తన గుట్టు ఎలా విప్పాడు..? అసలు అతను ఏ కారణాల వల్ల అలా చేశాడు..? విదేశాల్లో రాజకీయ నాయకులు దాచుకున్న నల్ల ధనాన్ని ఏం చేశాడు..? అన్నది అసలు కథ.  

జర్నలిస్ట్ సత్య మార్తాండ్ గా చాలా స్టైలిష్ గా ఉన్నాడు కళ్యాణ్ రాం. సినిమాకు అవసరమైన దేహ దారుడ్యాన్ని చూపించేందుకు ఎంతగానో కష్టపడ్డాడు. కచ్చితంగా కళ్యాణ్ రాం కు ఇది కొత్త అప్పియరెన్స్ అనే చెప్పాలి. ఫుల్ మాస్ మసాలా క్యారక్టర్ లో పూరి మార్క్ డైలాగులతో కళ్యాణ్ రాం ఆకట్టుకున్నాడు. అయితే అతని క్యారక్టరైజేషన్ విషయంలోనే పూరి ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ లో జర్నలిస్ట్ పవర్ గురించి చెప్పే కళ్యాణ్ రాం డైలాగ్స్ బాగున్నాయి. సినిమాలో హీరోయిన్ గా చేసిన అదితి ఆర్య మొదటి సినిమా కాబట్టి ఆ బెరుకు కనబడుతుంది. కొన్ని చోట్ల కొద్దిగా ఓవర్ అనిపిస్తుంది. మొదటి సినిమా అయినా పర్వాలేదు అనిపించుకుంది అమ్మడు. ఇక జావేద్ భాయ్ డాన్ క్యారక్టర్ లో మరోసారి అదరకొట్టాడు జగ్గు భాయ్. తన లుక్.. తన బాడీ లాంగ్వేజ్ పూరి స్టైల్ కనబడుతుంది. పొలిటిషియన్ గా పోసాని, ఫ్రెండ్ పాత్రలో వెన్నెల కిశోర్ నటించి మెప్పించారు.  



సినిమా మొత్తం పూరి మార్క్ స్టైల్ లో ఉంటుంది. కచ్చితంగా కళ్యాణ్ రాంను కొత్త స్టైలో చూపించడంలో సక్సెస్ అయ్యాడు పూరి. కాని సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్ చేశాడు. సినిమా మొత్తం సగటు ప్రేక్షకుడు ఊహించే లానే రన్ చేశాడు. దర్శకత్వం పరంగా ఓకే కాని కథనంలో సినిమా తేలగొట్టింది. ముఖేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్తగా చేసుంటే బాగుండేది. ఇక ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ నిర్మాణ విలువలు కూడా సినిమాకు కావాల్సినంత రిచ్ గా ఉన్నాయి. 

తండ్రి జర్నలిస్ట్ కాబట్టి అతనికి జరిగిన అన్యాయానికి తాను జర్నలిస్ట్ గా మారి సమాజం పట్ల గౌరవంతో అన్యాయాన్ని కరప్షన్ ను పారద్రోలాలని చూసే క్యారక్టర్ సత్య మార్తండది. అయితే ఈ క్రమంలో అన్ని అన్యాయాలకు కారణం అయిన జావేద్ ను టార్గెట్ చేసి అతని కూతురిని లైన్లో పెట్టి డేటా హ్యాక్ చేస్తాడు. ఇక దాని ద్వారా దేశంలో పొలిటికల్ లీడర్స్ అంతా జావేద్ బ్యాంక్ లో దాచుకున్న నల్లధనం అంతా బట్ట బయలు చేస్తాడు. 

కథ సింపుల్ గా చెప్పాలంటే ఇదే.. అయితే సత్య క్యారక్టర్ కు సమాజంలో జరుగుతున్న అన్యాల మీద పొలిటిషియన్స్ టార్గెట్ చేయడానికి గల రీజన్ ఏంటో చూపించలేదు. ఇక చెప్పడానికి పెద్ద డాన్ అని అతన్ని కూతురిని ట్రాప్ చేసి ఏకంగా ఇంట్లోకి రావడం ఇదంతా లాజిక్ లేకుండా ఉంటుంది. ఇంటర్వల్ బ్లాక్ లో సత్య ఇచ్చే షాక్ కాస్త సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచేలా చేసినా మళ్లీ సెకండ్ హాఫ్ అంతా రొటీన్ గా నడిపించాడు పూరి.

హీరో టార్గెట్ ఆ డబ్బు ప్రతి ఒక్క భారతీయుడి చేరడం.. అయితే ఈ సందర్భంలో నడిచే ప్రీ క్లైమాక్స్ కోర్ట్ సీన్ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. సినిమా కథ మొత్తం ఆ పది నిమిషాల ఎపిసోడ్ లో చెప్పడమే కాదు సినిమాకు కాస్త మైలేజ్ వచ్చేలా చేసేది ఆ ఎపిసోడే. అయితే ఆ తర్వాత మళ్లీ జావేద్ తన కూతురిని సత్య దగ్గరకు వదిలి మళ్లీ పరారీలోకి వెళ్లడం కాస్త కన్ ఫ్యూజ్ గా అనిపిస్తుంది. 

అసలు విలన్ జావేద్ ను పూరి ఎందుకు తప్పించాడు అని ప్రేక్షకులకు డౌట్ వస్తుంది. సినిమా మొదటి భాగంలోని కొన్ని సీన్స్, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు తప్ప ఇక మిగతాదంతా పూరి స్టైల్ లో నడుస్తుంది. బోర్ కొట్టకపోయినా సినిమా ఇంకా ఏదన్నా మెస్మరైజ్ చేస్తుందా అంటూ చివరకు నిరాశనే మిగిల్చేలా చేస్తుంది.



Nandamuri Kalyan Ram,Aditi Arya,Puri Jagannadh,Anup Rubensపూరి 'ఇజం' పక్కా కమర్షియల్..!

మరింత సమాచారం తెలుసుకోండి: