విజయ్ ఆంటోని, మ్యూజిక్ , సస్పెన్స్విజయ్ ఆంటోని, మ్యూజిక్ , సస్పెన్స్క్లైమాక్స్ , మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

దినేష్ (విజయ్ ఆంటోని) సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటాడు. తనకు తెలియకుండా తనతో ఎవరో మాట్లాడుతూ తనని సూసైడ్ చేసుకునేలా ప్రోత్సహిస్తారు. తనలో తానే మాట్లాడుకుంటూ తనకు తానుగా భయపడుతూ ఉన్న అతను అసలు ఎందుకు ఇలా అవుతుందని తెలుసుకునే క్రమంలో ఓ ఆత్మ తనతో మాట్లాడుతుందని.. తనతో సంఘర్షణ జరుపుతుందని తెలుసుకుంటాడు. రెండు తరాలు ముందు శాస్త్రి అనే ఓ బడి పంతులు తన భార్య జయలక్ష్మి చేత చంపబడతాడు. తన పూర్వ జన్మ రహస్యం తెలుసుకున్న దినేష్ అక్కడకు వెళ్లి పరిసరాలను చూస్తాడు. అక్కడ జయలక్ష్మిగా ఇప్పుడు తన భార్య ఐశ్వర్య (అరుంధతి నాయర్) అని తెలుసుకుని ఆమె నుండి తనను శాస్త్రి నుండి కూడా ఆమెను కాపాడాలనుకుంటాడు. అసలు శాస్త్రి జయలక్ష్మిని ఎందుకు చంపాలనుకున్నాడు..? ఐశ్వర్య దినేష్ ను ఎందుకు మోసం చేసింది..? అన్నది అసలు కథ.

బిచ్చగాడుతో తెలుగులో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఆంటోని ఓ సైకలాజికల్ థ్రిల్లర్ తో బేతాళుడుగా వచ్చాడు. సినిమా మొత్తం తన భుజాల మీదే వేసుకుని నడిపించాడు విజయ్. దినేష్, శాస్త్రి రెండు పాత్రల్లో శభాష్ అనిపించాడు. ఇక హీరోయిన్ అరుంధతి నాయర్ కూడా రెండు పాత్రల్లో బాగా నటించింది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు బాగా నటించారు.

సినిమా దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి కథను సస్పెన్స్ గా నడిపించిన తీరు మెచ్చుకోదగినదే. అయితే స్క్రీన్ ప్లే కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. మ్యూజిక్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తుంది ముఖ్యంగా జయలక్ష్మి పాట సినిమాకే హైలెట్. ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. కెమెరా మెన్ పనితనం బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు కావాల్సినంత రిచ్ గా ఉన్నాయి.   

విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు ఓ రేంజ్ హిట్ అవడంతో అదే అంచనాలతో బేతాళుడు కూడా బాగుంటుందని అంచనాలు ఏర్పడేలా చేశారు. టీజర్ ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో మంచి మౌత్ టాక్ ఏర్పడింది. అయితే అంచనాలు లేని బిచ్చగాడు పేక్షకుల మనసుని తాకగా బేతాళుడు మాత్రం అంతగా ఇంప్రెస్ చేయలేదు. 

దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగానే ఉంది. అది విజువల్ గా చూపించడంలో పొరపాట్లు చేశాడు. ఓ డ్రగ్స కోసమని హీరోను హీరోయిన్ తో మోసం చేయించడం అది సక్సెస్ అయ్యి హీరో తన ముందు తరం ఆత్మకు కనెక్ట్ అవడం కాన్సెప్ట్ అంతా బాగుంది. అయితే నేరేషన్ లో కాస్త స్లో అయ్యింది. సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో దర్శకుడు కొతమేరకు సక్సెస్ అయినా కొన్ని లాజిక్కులు చూస్తే మరి సినిమాటిక్ అని అనిపించక మానదు.

ఇక సినిమాకు చాలా ముఖ్యమైన క్లైమాక్స్ విషయంలో కూడా గ్రిప్ మిస్ అయ్యింది. డ్రగ్స్ ను మనుషుల మీద ప్రయోగిస్తున్న ముఠాని పట్టుకునే క్రమంలో హీరో తన పూర్వ జన్మ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం అసలు పాయింట్. దీన్నే దర్శకుడు కాస్త సాగదీసి చెప్పాడనిపిస్తుంది. ఇక సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా లేదని చెప్పాలి. సినిమా మొత్తం దాదాపు హర్రర్ సస్పెన్స్ మోడ్ లోనె వెళ్తుండటం సగటు సిని అభిమానికి కాస్త బోర్ కొడుతుంది.

ఓవరాల్ గా విజయ్ ఆంటోని సినిమాల్లో విషయం ఉంటుని అన్న క్లారిటీకి వచ్చినా బేతాళుడు విషయంలో మాత్రం ప్రేక్షకులు పెదవివిరిచే అవకాశం ఉంది. సినిమాలో సాంగ్స్ విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.  
Vijay Antony,Arundathi Nair,Prathi Krishnamurthy,Fathima Vijay Antonyఈ బేతాళుడు అంతగా ఏం భయపెట్టలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: